మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా తమ జీవిత భాగస్వాములను వెతుక్కోవడం ఈరోజుల్లో సర్వసాధరణమైంది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఫ్యామిలీ బ్యాంక్‌గ్రౌండ్ ఎలా ఉండాలనే విషయాలను ప్రొఫైల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అయితే ఓ అమ్మాయి తనకు కాబోయే వాడు ఎలాంటి వాడు అయి ఉండాలో పూస గుచ్చినట్లు చెబుతూ వివరించింది. వయసు, జీతం ఎంతుండాలి, విద్యార్హతలు ఎలా ఉండాలనే విషయాలను ఓ రెజ్యూమేలా తయారు చేసి పెట్టింది.
ఈమె డిమాండ్లు చూసిన ఓ యువకుడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. వెంటనే ఆమె ప్రొఫైల్ స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అది తెగ వైరల్ అయ్యింది. ఆ డిమాండ్లు ఏంటో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెడతారు
ఈ యువతికి కాబోయే వాడు 1992 జున్ తర్వాతే జన్మించి ఉండాలంట. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ ఇలా ఏం చదివినా పర్వాలేదు. కానీ దేశంలోని అగ్ర విద్యాసంస్థల్లోనే చదువు పూర్తి చేసి ఉండాలంట. ఐఐటీ, ఐఐఎం, బిట్స్ పిలానీ, ఐఐఎస్‌సీ, డీటీయూ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, బాంబే, ఢిల్లీ, రూర్కీ, ఖరగ్‌పూర్ ఇలా దేశంలోని ముఖ్య నగరాల యూనివర్సిటీల నుంచే డిగ్రీ పొంది ఉండాలట. ఈ కాలేజీల జాబితాను కూడా ఆ అమ్మాయి క్షుణ్నంగా ఫ్రొపైల్‌లో పొందుపరిచింది.
అంతేకాదు జీతం ఏడాదికి కనీసం రూ.30లక్షలు ఉండాలట. కార్పొరేట్ సెక్టార్‌లోనే పనిచేయాలట. వరుడికి తోబుట్టువులు ఇద్దరికంటే ఎక్కువ ఉండొదట. బాగా చదువుకున్న కుటుంబం అయితే ప్రాధాన్యం ఇస్తుందట. ముఖ్యంగా వరుడి ఎత్తు 5.7 అడుగుల నుంచి 6 అడుగులు ఉండాలట.
మిశ్రమ స్పందన..
ఈ యువతి డిమాండ్లను చూసి నెటిజన్ల నుంచి భిన్న స్పందన లభించింది. ఆమె డిమాండ్లలో తప్పేముంది, ఎలాంటి వాడు కావాలో కోరుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంది.. అని కొందరు సమర్థించారు.
మరికొందరు మాత్రం ఈమె పెళ్లి చేసుకుంటుందా లేదా భర్తను హైర్ చేస్కుంటుందా అని మండిపడ్డారు. ఒకవేళ ఇవే డిమాండ్లను ఒక అబ్బాయి పోస్టు చేసి ఉంటే ఎంత వివాదం అయ్యేదో ఓసారి ఊహించుకోండి అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు. మరో నెజిటన్ స్పందిస్తూ.. ఈమెకు కావాల్సింది పెళ్లికొడుకు కాదు, బ్యాంక్ అని ఛలోక్తులు విసిరాడు.
What is your take on this? pic.twitter.com/FWO1YGyxge
— Dr.D G Chaiwala (@RetardedHurt) October 17, 2022
చదవండి: రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు
Comments
Please login to add a commentAdd a comment