matrimonial advertisements
-
6 అడుగుల ఎత్తు.. 30 లక్షల ఉద్యోగం ఉన్నోడే కావాలి..!
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా తమ జీవిత భాగస్వాములను వెతుక్కోవడం ఈరోజుల్లో సర్వసాధరణమైంది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఫ్యామిలీ బ్యాంక్గ్రౌండ్ ఎలా ఉండాలనే విషయాలను ప్రొఫైల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అయితే ఓ అమ్మాయి తనకు కాబోయే వాడు ఎలాంటి వాడు అయి ఉండాలో పూస గుచ్చినట్లు చెబుతూ వివరించింది. వయసు, జీతం ఎంతుండాలి, విద్యార్హతలు ఎలా ఉండాలనే విషయాలను ఓ రెజ్యూమేలా తయారు చేసి పెట్టింది. ఈమె డిమాండ్లు చూసిన ఓ యువకుడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. వెంటనే ఆమె ప్రొఫైల్ స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్లో షేర్ చేయగా.. అది తెగ వైరల్ అయ్యింది. ఆ డిమాండ్లు ఏంటో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెడతారు ఈ యువతికి కాబోయే వాడు 1992 జున్ తర్వాతే జన్మించి ఉండాలంట. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ ఇలా ఏం చదివినా పర్వాలేదు. కానీ దేశంలోని అగ్ర విద్యాసంస్థల్లోనే చదువు పూర్తి చేసి ఉండాలంట. ఐఐటీ, ఐఐఎం, బిట్స్ పిలానీ, ఐఐఎస్సీ, డీటీయూ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, బాంబే, ఢిల్లీ, రూర్కీ, ఖరగ్‌పూర్ ఇలా దేశంలోని ముఖ్య నగరాల యూనివర్సిటీల నుంచే డిగ్రీ పొంది ఉండాలట. ఈ కాలేజీల జాబితాను కూడా ఆ అమ్మాయి క్షుణ్నంగా ఫ్రొపైల్లో పొందుపరిచింది. అంతేకాదు జీతం ఏడాదికి కనీసం రూ.30లక్షలు ఉండాలట. కార్పొరేట్ సెక్టార్లోనే పనిచేయాలట. వరుడికి తోబుట్టువులు ఇద్దరికంటే ఎక్కువ ఉండొదట. బాగా చదువుకున్న కుటుంబం అయితే ప్రాధాన్యం ఇస్తుందట. ముఖ్యంగా వరుడి ఎత్తు 5.7 అడుగుల నుంచి 6 అడుగులు ఉండాలట. మిశ్రమ స్పందన.. ఈ యువతి డిమాండ్లను చూసి నెటిజన్ల నుంచి భిన్న స్పందన లభించింది. ఆమె డిమాండ్లలో తప్పేముంది, ఎలాంటి వాడు కావాలో కోరుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంది.. అని కొందరు సమర్థించారు. మరికొందరు మాత్రం ఈమె పెళ్లి చేసుకుంటుందా లేదా భర్తను హైర్ చేస్కుంటుందా అని మండిపడ్డారు. ఒకవేళ ఇవే డిమాండ్లను ఒక అబ్బాయి పోస్టు చేసి ఉంటే ఎంత వివాదం అయ్యేదో ఓసారి ఊహించుకోండి అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు. మరో నెజిటన్ స్పందిస్తూ.. ఈమెకు కావాల్సింది పెళ్లికొడుకు కాదు, బ్యాంక్ అని ఛలోక్తులు విసిరాడు. What is your take on this? pic.twitter.com/FWO1YGyxge — Dr.D G Chaiwala (@RetardedHurt) October 17, 2022 చదవండి: రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు -
వయసు 73.. వరుడు కావలెను; నెటిజన్ల ప్రశంసలు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇటీవల 73ఏళ్ల రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు జీవిత భాగస్వామి కోసం ‘వరుడు కావలెను’ అని పెళ్లి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన స్థానికంగానూ, సామాజిక మాధ్యమంలోనూ విపరీతంగా చర్చకు దారితీసింది. చాలామంది ఆమె ధైర్యానికి, పాజిటివ్ ఆలోచనను మెచ్చుకోగా, మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినవారూ ఉన్నారు. ఇంకొందరు ఈ బామ్మ ట్రెండ్‌సెటర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరు, వయసేంటో మర్చిపోయావా బామ్మా అని ఇంకొకరు.. ఇలా తలా ఒక మాట అన్నవారూ ఉన్నారు. ఈ ప్రకటన వెనుక ఉన్న అంతర్లీన సమస్యపై మాత్రం ఎవరూ అంతగా దృష్టిపెట్టలేదు. ఒంటరి జీవితం.. ప్రకటనలో ఆమె ..‘సంప్రదాయ కుటుంబం, ఆరోగ్యంగా ఉన్న 70 ఏళ్ల పైబడిన వ్యక్తితో జీవితం పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాన’ని తెలిపింది. ఆమె తన గురించి తెలియజేస్తూ– ‘నాకు నా సొంత కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు చనిపోయారు. నా మొదటి వివాహం, విడాకులు బాధాకరమైనవి కావడంతో ఇన్నేళ్లుగా తిరిగి వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఒంటరి జీవితం నన్ను భయపెడుతోంది. ఎవరి సాయం లేకుండా బస్‌స్టాప్ నుండి ఇంటికి, ఇంటి నుండి బయటకు నడవడానికి, ఇంట్లో ఒంటరిగా ఉండటానికి కూడా భయపడుతున్నాను. అందుకే జీవితభాగస్వామి కోసం చూస్తున్నాన’ని తెలిపింది. మూసధోరణులు విచ్ఛిన్నం వివాహం, జీవిత భాగస్వామి అనే విషయాలు ఇంకా మన వ్యవస్థలో సంప్రదాయక కోణం నుంచే ఆలోచిస్తున్నారు. కానీ, ఒంటరి జీవితానికి ఏ వయసులోనైనా తోడు అవసరం అనే విషయం అంతగా పట్టించుకోరు. అందుకే, ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అయితే, యువత నుంచి మాత్రం ఆమె నిర్ణయం సమాజంలో సాంస్కృతిక మూసలను విచ్ఛిన్నం చేస్తుందని విపరీతంగా ప్రశంసలు అందుకుంది. సామాజిక కార్యకర్తలు ఈ విషయం పట్ల స్పందిస్తూ ‘మహిళలు అనేకాదు మగవారు కూడా ఒంటరితనం పట్ల భయపడుతుంటారు. అయితే, భాగస్వామి కోసం ఎంచుకునే స్వతంత్రం మగవారికే అధికంగా ఉంటుంది. దీనినే ఇప్పటివరకు సమాజం ఆమోదిస్తూ వచ్చింది. ఇలాంటి ధోరణికి ఈ ప్రకటన ఓ సమాధానం అవుతుంది’ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అద్దం ‘సమాజంలో వృద్ధుల పరిస్థితి ఎలా ఉందో ఈ పరిస్థితి కళ్లకు కడుతుంది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం కూడా మానసిక సమస్యలు పెరగడానికి కారణం అవుతున్నాయని’ మానసిక నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఒంటరిగా ఉండే వాళ్లు తోడు కోరుకుంటారు. అయితే, ఆమె సంప్రదాయ కోణంలో జీవితాంతం ఉండే తోడు అవసరం గురించి ఆలోచించి ఆ ప్రకటన ఇచ్చింది. చాలాకాలంగా మూస పితృస్వామ్య ఆలోచనకు, యవ్వనంగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంటారనే ఆలోచనలకు ఈ ప్రకటన ఒక అడ్డంకిని తొలగిస్తుంది. ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసిన 69 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు తోడుగా ఉంటాననే స్పందన రావడం గమనార్హం. -
ఆన్ లైన్ పెళ్లి సంబంధాలపై డేగ కన్ను!
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో ప్రొఫైళ్ల ద్వారా వరుడు లేదా వధువులను బోల్తాకొట్టించి డబ్బు లేదా వేరే విధంగా దోచుకునేవారికి త్వరలో ముకుతాడు పడనుంది. ఇప్పటివరకు కేవలం వధవు లేదా వరుడి వివరాల్లో ఫోన్ నంబర్‌ను మాత్రమే తీసుకుని యూజర్లకు మెసేజ్ ద్వారా వివరాలను పంపుతున్న వెబ్సైట్లు.. ఇకపై ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి లేదా ఏదైనా ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ ను తప్పనిసరిగా తమ అకౌంట్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నియమ నిబంధనలు మారనున్నాయని ఓ అధికారి తెలిపారు. దీంతోపాటు మాట్రిమోనియల్ లో అకౌంట్‌ను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారనే ప్రశ్నకు కూడా వినియోగదారుడు సమాధానం రాయాల్సి ఉంటుందని, అప్పుడే అకౌంట్ ఓపెన్ అవుతుందని వివరించారు. గత కొద్దికాలంగా ఆన్ లైన్ ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకుని అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఫేక్ ప్రొఫైల్స్ తో ఎదుటివారిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మాట్రిమోనియల్ వెబ్ సైట్లను నియంత్రించే పనిలో పడింది. మాట్రిమోనియల్ వెబ్ సైట్ ను నడిపే ప్రతి ఒక్కరూ.. వెబ్ సైట్ లో గ్రీవియన్స్ ఆఫీసర్ పేరుతో ఆప్షన్ అందుబాటులో ఉంచాలని.. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు రాగానే స్పందించే మెకానిజాన్ని ఏర్పాటు చేయాలనే సూచనలు వెళ్లినట్లు వివరించారు. 2014లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తొలిసారి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. పెళ్లి కోసం ఆన్ లైన్ లో సమాచారాన్ని ఉంచుతున్న అమ్మాయిలను తప్పుడు ప్రొఫైళ్ల ద్వారా అబ్బాయిలు మోసగిస్తున్నారనే ఫిర్యాదులు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. భారత్ మ్యాట్రిమోనీ, జీవన్ శాంతి తదితర సంస్థల సీనియర్ ప్రతినిధులను పిలిపించి, తగిన భధ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పెళ్లి పేరుతో మోసపోయేవారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నట్లు ఆమె వివరించారు. తాజా నిబంధనలతో ప్రొఫైళ్లను తయారుచేసినప్పుడు ఐపీ అడ్రసును వెబ్ సైట్లు రికార్డు చేసుకోనున్నాయి. ఒక సంవత్సర కాలంలో అకౌంట్ ను ఎన్ని మార్లు ఎక్కడెక్కడి నుంచి ఉపయోగించారో కూడా ఈ రికార్డుల్లోకి రానుంది.