డ్యాన్స్ చేసిందని డైవర్స్ ఇచ్చేశాడు | Divers gave because of dancing | Sakshi
Sakshi News home page

డ్యాన్స్ చేసిందని డైవర్స్ ఇచ్చేశాడు

Published Tue, May 3 2016 2:40 AM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM

డ్యాన్స్ చేసిందని డైవర్స్ ఇచ్చేశాడు - Sakshi

డ్యాన్స్ చేసిందని డైవర్స్ ఇచ్చేశాడు

ఖతార్: భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం మామూలే.. పెద్ద జగడాలు జరిగినా విడాకులు వరకు వెళ్లడానికి ఈ రోజుల్లో ఎవరూ సిద్ధంగా ఉండడం లేదు. కానీ, ఖతార్‌లో మాత్రం ఓ భర్త తన భార్య డ్యాన్స్ చేస్తుందని విడాకులు ఇచ్చేశాడు. భక్తి చానళ్లు తప్ప వేరే చానళ్లు ఏవీ చూడకూడదని పెళ్లి అయిన కొత్తలో ఆమె చేత ప్రమాణం చేయించుకున్నాడు సదరు భర్త. అయితే ఓ చానల్‌లో తనకిష్టమైన పాట వస్తుండడంతో తనను తాను తమాయించుకోలేక ఆమె కాలు కదిపింది.

సరిగ్గా అదే సమయానికి ఆఫీసు నుంచి వచ్చిన భర్త అది చూసి కోపోద్రిక్తుడయ్యాడు. నా ఆజ్ఞను పట్టించుకోవా అంటూ ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. వెంటనే విడాకులు కూడా ఇచ్చేశాడు. పెళ్లినాటి ప్రమాణాలను మరచి, తనను మోసం చేసిన భార్యను క్షమించేదిలేదని కూడా స్పష్టం చేశాడు. అయితే ఈ విషయాన్ని వెల్లడించిన సౌదీ మీడియా ఆ భార్యభర్తల వివరాలు మాత్రం వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement