
పాపం సమంత
చక్కని అందం, అభినయం, ఆహార్యం లాంటివి ఒకప్పుడు కథానాయికలకు కావలసిన అర్హతలు. వీటి కోసం వాళ్లు ఎంతో సాధన చేసేవాళ్లు. ఇప్పటి హీరోయిన్లలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయా అంటే సమాధానం దొరకదు. ఈ తరం హీరోయిన్లలో నటన కంటే గ్లామర్‌ను నమ్ముకున్న వాళ్లే ఎక్కువ. హీరోలతో నాలుగు స్టెప్పులు వేసి అందాలరబోయడం వరకే పరిమితమైపోతున్నారు. అయితే డ్యాన్స్ విషయంలో సమంత కాస్త వెనకబడిందని చెప్పవచ్చు.
కోలీవుడ్‌లో పాగా వేయాలనే కోరిక ఈ బ్యూటీకి నెరవేరడం లేదనే చెప్పాలి. నాన్ ఈ చిత్రం విజయం సాధించినా సమంతకు రావలసినంత పేరు రాలేదు. తాజాగా లింగుస్వామి దర్శకత్వంలో సూర్యతో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. మరోవైపు తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అక్కడ హీరోయిన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సమంత నటించాల్సిన ఒక అవకాశాన్ని తమన్న తన్నుకుపోయింది. ఇదిలావుండగా పాటల చిత్రీకరణలో సమంత పలు టేక్‌లు తీసుకుంటోందట.
అందుకు కారణం ఆమెకు డ్యాన్స్ మూమెంట్స్ సరిగా రాకపోవడమే. అందుకే డ్యాన్స్ మాస్టర్లు తక్కువ మూవ్‌మెంట్ ఉండే స్టెప్పులను సమంతకు కంపోజ్ చేస్తున్నారట. ఈ విషయమై సమంత ట్విట్టర్‌లో స్పందించింది. సినిమాల్లో తనకు నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్ అని పేర్కొంది. అయినా డ్యాన్సర్లందరినీ గౌరవిస్తానని తెలిపింది. ముఖ్యంగా తమన్న డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది.