
అందల తార శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ధడక్ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన జాన్వి.. తొలి సినిమాతోనే అభిమానుల మనసులు దోచుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న జాన్వి.. ఇటీవల నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆభిమానుల కోరిక మేరకు డ్యాన్స్ చేశారు. ధడక్ చిత్రంలోని ‘జింగ్ జింగ్ జింగాత్’ సాంగ్‌కు ఆమె వేదికపై స్టెప్పులేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొద్దిరోజుల కిందట ఓ పాత హిందీ పాటకు తను డ్యాన్స్ చేస్తున్న వీడియోను జాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన ‘ఘోస్ట్ స్టోరిస్’లో జాన్వి తనదైన నటనతో ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment