డాన్స్ చేయడమే ఆమె చేసిన తప్పా? | Man divorces wife for dancing | Sakshi
Sakshi News home page

డాన్స్ చేయడమే ఆమె చేసిన తప్పా?

Published Fri, Sep 11 2015 11:05 AM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM

డాన్స్ చేయడమే ఆమె చేసిన తప్పా? - Sakshi

డాన్స్ చేయడమే ఆమె చేసిన తప్పా?

ఖతార్: తన అభీష్టానికి భిన్నంగా ప్రవర్తించదనే కారణంతో భార్యకు విడాకులిచ్చాడో భర్త. తాను వద్దన్నా వినకుండా డాన్స్ చేసిందనే సాకుతో వివాహ బంధాన్ని తెంచుకున్నాడు. టీవీలో వస్తున్న తనకు ఇష్టమైన పాటకు డాన్స్ చేయడమే ఆమె చేసిన అపరాధం. అరబ్ దేశం సౌదీ అరేబియాలో ఈ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది.

భక్తి చానళ్లు తప్ప ఇతర చానళ్లు చూడొద్దని  తన భార్యకు సదరు భర్త ఫర్మానా జారీచేశాడు. తన మాట కాదని ముందుకెళ్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించేవాడు. ఒకరోజు భర్త ఇంట్లో లేనప్పుడు భార్య తనకిష్టమైన చానల్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదించసాగింది. సంగీతానికి అనుగుణంగా పాదం కలిపింది. భర్త ఇంటికి తిరిగొచ్చేప్పటికి పాటకు అనుగుణంగా డాన్స్ చేస్తున్న భార్య కనపడింది. ఆగ్రహంతో ఊగిపోయిన అతడు వెంటనే భార్యకు తలాక్ చెప్పేశాడు. తన ఆజ్ఞను అతిక్రమించినందుకు విడాడులిచ్చేశాడు. "

పెళ్లినాటి ప్రమాణాలను పట్టించుకోకుండా తనను మోసం చేసిందని, ఆమెను క్షమించే ప్రసక్తే లేదని సదరు భర్త చెప్పడం శోచనీయం. అయితే భార్యాభర్తలు వివరాలు, సౌదీ అరేబియాలో వారు ఎక్కడ నివసిస్తున్నారనేది మీడియా వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement