నాడు గ్లామర్‌ ఫోటోలతో రచ్చ.. నేడు మూడు భారీ సినిమాల్లో ఛాన్సులు | Dushara Vijayan Gets Chance In Vikram Movie | Sakshi
Sakshi News home page

నాడు గ్లామర్‌ ఫోటోలతో రచ్చ.. నేడు మూడు భారీ సినిమాల్లో ఛాన్సులు

Published Fri, Apr 5 2024 8:00 AM | Last Updated on Fri, Apr 5 2024 8:59 AM

Dushara Vijayan Get Vikram Movie Chance - Sakshi

చియాన్‌ విక్రమ్‌ అంటేనే వైవిధ్యానికి మారు పేరు. ఈయన తాజాగా నటించిన తంగలాన్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో విక్రమ్‌ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన నటించే 62వ చిత్రం అవుతుంది. ఇటీవల చిత్తా (చిన్నా) వంటి సక్సెస్‌పుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హెచ్‌ఆర్‌.పిక్చర్స్‌ పతాకంపై రియా శిబూ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టెయిన్‌ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు.

కాగా ఇందులో నటుడు ఎస్‌జే.సూర్య, సురాజ్‌ వెంజరముడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. హీరో యిన్‌గా నటించే లక్కీఛాన్స్‌ను యువ నటి దుషారా విజయన్‌ దక్కించుకున్నారు. పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంపరై చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసిన ఈ చిన్నది అందులో మరియమ్మ పాత్రలో జీవించి, అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత నక్షత్రం నగరుదు వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్‌ వైపు దృష్టి సారించారు.

అలా గ్లామరస్‌ ఫొటోలను ప్రత్యేకంగా తీయించుకుని, సామాజక మాధ్యమాల్లో విడుదల చేశారు. అలా మరింత వార్తల్లోకి ఎక్కిన దుషారా ప్రస్తుతం ధనుష్‌ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఆయన 50వ చిత్రంలో నటించారు. ఇది త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా నటుడు రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్‌ చిత్రంలోనూ ఈ అమ్మడు నటించడం విశేషం. తాజాగా విక్రమ్‌తో జత కట్టే లక్కీఛాన్స్‌ను దక్కించుకుంది.

ఈ విషయాన్ని చిత్ర వర్గాలు బుధవారం అధికారికంగా ప్రకటించాయి. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతం, తేని ఈశ్వర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ క్రేజీ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement