TV Actress Rekha Nair Bold Comments On Women Dress Sense - Sakshi
Sakshi News home page

Rekha Nair: అక్కడ టచ్ చేస్తే ఎంజాయ్ చేస్తా: బిగ్‌బాస్ నటి వివాదస్పద కామెంట్స్!

Published Sat, Jul 8 2023 6:26 PM | Last Updated on Sat, Jul 8 2023 6:57 PM

Tv Actress Rekha Nair Bold Comments On Womens Dress Sense - Sakshi

సినీ ఇండస్ట్రీలో తరచుగా ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు తమ కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతుంటారు. అంతేకాకుండా ఇటీవల హీరోయిన్స్ ఎక్కువగా వేధింపులకు గురైనట్లు మన వింటుంటాం. కానీ ఇటీవల ఓ బుల్లితెర మహిళల పట్ల వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేఖా నాయర్ మహిళల డ్రెస్‌ కోడ్‌ పట్ల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 

(ఇది చదవండి: స్టార్‌ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!)

తమిళంలో టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్‌బాస్ సీజన్‌-7లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే తాజాగా మహిళల పట్ల ఆమె చేసిన కామెంట్స్‌పై మండిపడుతున్నారు. రేఖా నాయర్ మహిళల డ్రెస్‌ కోడ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇటీవల మహిళలు చాలా సెక్సీ డ్రెస్సులు ధరిస్తున్నారు. అందువల్లే అబ్బాయిలు అలా ప్రవర్తిస్తున్నారంటారా? ఈ విషయంలో మరీ మీ సంగతి ఏంటి? అని యాంకర్ ఆమెను ప్రశ్నించింది. 

దీనికి రేఖ సమాధానమిస్తూ.. 'అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి. అంతే కానీ ఏదో జరిగిపోయిందంటూ నానా హడావుడి చేయొద్దు. ఈ విషయంలో అమ్మాయిలు  తమ వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నేను వేసుకునే డ్రెస్‌ గురించి చాలా మంది లేడీస్ అడుగుతుంటారు. కానీ ఎవరైనా వ్యక్తి నా నడుముపై చేయి వేస్తే నేను కోప్పడను.. ఆనందిస్తా.  నేను చీర కట్టుకుంటే నా నడుము కనిపిస్తుంది. బస్సులో వెళ్లినా ఎవరైనా చేయి వేస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ రాదు. ఈ రోజుల్లో మహిళలు ఇలాంటి మనసత్వాలను దూరం చేసుకోవాలి. నేను జాగింగ్ చేసినా, ఏదైనా పోటీలో పాల్గొన్నా నడుము కనిపించే డ్రెస్సులే వేసుకుంటా. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.'  అంటూ వివాదస్పద కామెంట్స్ చేసింది.  అంతేకాకుండా ‍అమ్మాయిల డ్రెస్సులను మెచ్చుకునేది కేవలం అబ్బాయిలు మాత్రమేనన్నారు. అయితే ఆమె మాటలను కొందరు ప్రశంసించగా.. మహిళలు మాత్రం మండిపడుతున్నారు.

(ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్‌ వస్తుంది: మాళవిక)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement