రియల్ రిచ్‌నెస్ | Real richness | Sakshi
Sakshi News home page

రియల్ రిచ్‌నెస్

Published Sat, Feb 20 2016 10:06 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

రియల్ రిచ్‌నెస్ - Sakshi

రియల్ రిచ్‌నెస్

ఆత్మబంధువు
‘‘అమ్మా... అమ్మా..’’ స్కూల్‌నుంచి వస్తూనే పిలిచాడు మిత్ర. సమాధానం రాలేదు. ఇళ్లంతా వెతికి చూశాడు. అమ్మ కనిపించలేదు.
 ‘‘నాన్నమ్మా.. అమ్మ ఏదీ?’’ అని అడిగాడు రత్నమాంబను.
 ‘‘ఏదో కొనాలని షాపింగ్‌కు వెళ్లింది నాన్నా. నీకూ, అక్కకూ స్నాక్స్ పెట్టి ఉంచింది. వెళ్లి తినేయండి.’’
 ‘‘ఓహ్.. ఓకే’’ అని అక్కతో కలిసి స్నాక్స్ తినేసి ఆడుకుంటున్నాడు మిత్ర.
 

ఇంతలో ఆనంద్ ఆఫీసునుంచి వచ్చీ రాగానే.. ‘‘రేఖా.. రేఖా’’ అని పిలిచాడు.
 ‘‘అమ్మ లేదు నాన్నా. షాపింగుకు వెళ్లిందట’’ అని చెప్పింది మైత్రి.
 ఆనంద్ కాఫీ పెట్టుకుని తాగి, సోఫాలో కూర్చున్నాడు. .
 ‘‘నాన్నా... నాన్నా..’’ అంటూ వచ్చాడు మిత్ర.
 ‘‘ఏంటి నాన్నా...’’ అంటూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆనంద్.
 ‘‘మనం రిచ్చా? పూరా?’’ అడిగాడు మిత్ర.
 ‘‘ఎందుకు నాన్నా?’’
 ‘‘ముందు నువ్వు ఆన్సర్ చెప్పు.’’
 
‘‘రిచ్ అనుకుంటే రిచ్... పూర్ అనుకుంటే పూర్.’’
 ‘‘అలా ఎలా ఉంటారు నాన్నా?’’
 ‘‘ఉంటారు నాన్నా. ఎందుకంటే రిచ్‌నెస్ అనేది డబ్బుకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. అది ముఖ్యంగా మన ఆలోచనలకు, అలవాట్లు, ఆటిట్యూడ్‌కూ సంబంధించిన విషయం కాబట్టి.’’
 ‘‘మ్‌మ్‌మ్... అర్థం కాలేదు’’ అంటూ తల అడ్డంగా తిప్పాడు మిత్ర. పక్కన హోమ్‌వర్క్ చేసుకుంటున్న మైత్రి ఆసక్తిగా వింటోంది.
 ‘‘మొన్న నువ్వు ప్లేస్టేషన్ కావాలని ఏడ్చావట కదా.’’
 ‘‘ఇప్పుడు అడగడం లేదుగా.’’
 
‘‘ఇప్పుడు అడగడం లేదులే. అసలెందుకు ఏడ్చావో చెప్పు.’’
 ‘‘నీకు ప్లే స్టేషన్ కూడా లేదని ఆర్యన్ గాడు కామెంట్ చేస్తే బాధేసి ఏడ్చా.’’
 ‘‘సరే... ఆర్యన్ దగ్గర ఇంకా ఏమేం ఉన్నాయి?’’
 ‘‘ఐపాడ్ ఉంది. వాళ్లింట్లో స్మార్ట్ టీవీ ఉంది. ఆల్సేషియన్ డాగ్ ఉంది. ఇంకా.. చాలా ఉన్నాయి.’’
 ‘‘వాటన్నింటితో వాడెప్పుడు ఆడుకుంటాడు?’’
 ‘‘వాళ్ల డాడీ పార్టీకి, మమ్మీ క్లబ్‌కి వెళ్లినప్పుడు.’’
 ‘‘అంటే ఆర్యన్... వాళ్ల మమ్మీ, డాడీతో ఆడుకోడా?’’
 ‘‘వాళ్లు బిజీగా ఉంటారట. వీక్లీ వన్స్ బయటకు తీసుకువెళ్తారని చెప్పాడు.’’
 ‘‘సో.. హి ఈజ్ పూర్.’’
 
‘‘అదెలా డాడీ?’’
 ‘‘పూర్ పేరెంట్స్ పిల్లలకు వస్తువులు కొనిస్తారు. రిచ్ పేరెంట్స్ పుస్తకాలు కొనిస్తారు.’’
 ‘‘ఓహ్... అవునా! అందుకేనా మమ్మీ, నువ్వు ఎప్పుడూ బుక్స్ కొనిస్తుంటారు. ఇంకా?’’
 ‘‘రిచ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లు రోజూ ఏదో ఒకటి చదువుతారు, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు. పరిస్థితులను తిట్టుకోకుండా తమ ప్రవర్తనకు, తమ జయాపజయాలకు తామే బాధ్యత తీసుకుంటారు. తమకు సాయం చేసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్తారు. రిలేషన్‌షిప్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంటర్నెట్‌ను ఆఫీసు, వృత్తిగత అవసరాల కోసమే వాడతారు. జంక్‌ఫుడ్ తక్కువ తింటారు, రోజూ వ్యాయామం చేస్తారు. చాలా?’’
 ‘‘డాడీ... ఇవన్నీ నువ్వూ చేస్తావుగా?’’
 ‘‘కదా.. ఇప్పుడు నువ్వే చెప్పు.. మీ డాడీ రిచ్ ఆర్ పూర్?’’
 
‘‘మై డాడ్ ఈజ్ రిచ్’’ అంటూ హగ్ చేసుకున్నాడు మిత్ర.
 ‘‘మరి రిచ్ కిడ్ కావాలంటే ఏం చేయాలి డాడీ?’’ అడిగింది మైత్రి.
 ‘‘ఓహ్... నువ్వు వింటున్నావా! గుడ్ క్వశ్చన్. రిచ్ కిడ్ కావాలంటే... రోజుకు గంటకు మించి టీవీ, సోషల్ నెట్‌వర్క్, సెల్‌ఫోన్ వాడకూడదు.’’
 ‘‘అవునా... నేను రోజుకు గంటకు మించి టీవీ చూడనుగా. అయితే నేను రిచ్ కిడ్‌నేగా!’’
 ‘‘ఒక్కోటీ గంట కాదు తల్లీ.. మూడూ కలిపి గంట.’’
 ‘‘అవునా... అయితే నేను టీవీ, ఫేస్‌బుక్ తగ్గించుకోవాలి.’’
 ‘‘ఇంకా టిప్స్ చెప్పు డాడీ’’ అడిగాడు మిత్ర.
 ‘‘టిప్స్ కాదు నాన్నా. రిచ్ హాబిట్స్ ఫర్ కిడ్స్. రోజూ ఎక్సర్‌సైజ్ చేయాలి.

నెలకు కనీసం రెండు బుక్స్ చదవాలి. ఎక్క డైనా వాలంటీర్‌గా పనిచేయాలి. పాకెట్‌మనీలో కనీసం 25 శాతం దాచుకోవాలి. ఆ డబ్బుతో సెల్‌ఫోన్లు, సినిమాలు కాకుండా బుక్స్ కొనుక్కోవాలి. లేదా ఎవరికైనా డొనేట్ చేయాలి. పేరెంట్స్‌తో రోజుకు కనీసం గంటసేపు కబుర్లు చెప్పుకోవాలి. బంధువులకూ, ఫ్రెండ్స్‌కూ బర్త్‌డే గ్రీటింగ్స్ మర్చిపోకుండా చెప్పాలి. రిలేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్.’’
 ‘‘థాంక్స్ టూ ఎఫ్‌బీ, అందరి బర్త్‌డేలూ గుర్తుచేస్తుంది’’ అంది మైత్రి.‘‘ఎఫ్‌బీలో అకౌంట్ లేనివాళ్లకు కూడా చెప్పాలి బుజ్జీ’’ అన్నాడు ఆనంద్.
 ‘‘ష్యూర్ డాడ్!’’ అంటూ నవ్వేసింది మైత్రి.
 - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement