రేఖతో మాట్లాడుతున్న ఏఎస్‌ఐ భిక్షంగౌడ్
ఆత్మకూరు–ఎం (ఆలేరు) : ప్రేమించిన వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే తనకు ఆత్మహత్య శరణ్యమంటూ మోత్కూరు మండలం జామచెట్లబావి గ్రామానికి చెందిన బీసు రేఖ ఆత్మకూరు(ఎం) మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన సూదగాని శివరాం ఇంటి ఎదుట సోమవారం ఆందోళనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం జామచెట్లబావికి చెందిన బీసు సత్యనారాయణ–అరుణ కుమార్తె రేఖ.. ఆత్మకూరు(ఎం) మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన సూదగాని కృష్ణమూర్తి–సురమాంబ కుమారుడు శివరామ్ ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన రేఖ తల్లిదండ్రులు ఆమెకు జనగాం మండలం సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించారు.
వివాహానంతరం రేఖ తాను రాఘవాపురం గ్రామానికి చెందిన శివరాంను ప్రేమించానని.. అతడితోనే ఉంటానని చెప్పడంతో భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. అప్పటి నుంచి రేఖ పుట్టిట్లోనే ఉంటూ తనను పెళ్లి చేసుకోవాలని శివరామ్‌ను అడుగుతోంది. తనను ప్రేమించి మరో వివాహం చేసుకున్న నిన్ను పెళ్లి చేసుకోనని, అసలు నీతో ఎటువంటి సంబంధం లేదని శివరాం అన్నాడు. దీంతో రేఖ సోమవారం రాఘవాపురంలో శివరామ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. పెళ్లంటూ చేసుకంటే శివరామ్‌నే చేసుకుంటానని.. లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యం అని అంటోంది. ఆ సమయంలో శివరామ్ ఇంట్లో లేడు. దీంతో తల్లిదండ్రులు కృష్ణమూర్తి– సురమాంబలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ భిక్షంగౌడ్ అక్కడకు చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం కౌన్సిలింగ్ నిమిత్తం రేఖను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment