రేఖకు యష్ చోప్రా స్మారక అవార్డు | rekha to receive prestigious yash chopra memorial award | Sakshi
Sakshi News home page

రేఖకు యష్ చోప్రా స్మారక అవార్డు

Published Sat, Dec 19 2015 11:54 AM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

రేఖకు యష్ చోప్రా స్మారక అవార్డు - Sakshi

రేఖకు యష్ చోప్రా స్మారక అవార్డు

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత యష్చోప్రా జ్ఞాపకార్థం టియస్ఆర్ ఫౌండేషన్ ప్రతియేటా ప్రతిష్ఠాత్మకమైన యష్చోప్రా స్మారక అవార్డు అందిస్తోంది. గతంలో అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్ లాంటి లెజెండ్స్ అందుకున్న ఈ అవార్డును ఈ ఏడాదికి గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖకు అందించనున్నారు. ఫిబ్రవరి 2న ముంబైలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ అవార్డ్ ప్రదానోత్సవం జరగనుంది.

సినీరంగంలో విశేష సేవలందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది ఈ అవార్డులను అందిస్తున్నారు. ఇందులోభాగంలో అవార్డు గ్రహీతలకు స్వర్ణ పతకంతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతిని కూడా అందిస్తారు. జ్యూరీ సభ్యులుగా ఉన్న హేమమాలిని, జయప్రద, బోనీ కపూర్, సుబ్బిరామిరెడ్డి అలనాటి బాలీవుడ్ నటి రేఖను ఈ ఏడాది యష్చోప్రా అవార్డ్కు ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement