Yash Chopra Memorial Award
-
యశ్ చోప్రా అవార్డు అందుకున్న ఆశా
లెజండరీ సింగర్ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ శుక్రవారం ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నటి జయప్రద, బాలీవుడ్ నటి రేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా భోంస్లేకు రేఖ అభినందనలు తెలిపి, పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2012లో చనిపోయిన యశ్ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు. -
ఆశాభోస్లేకు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు
భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తరువాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుంచి నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును సినీ ప్రముఖులకు అందజేస్తున్నారు. 2017 సంవత్సరానికి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు ఇవ్వనున్నారు. శనివారం ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి, ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు. గతంలో ఈ అవార్డును లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017'ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. 1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ వయసులోనే నేపథ్య గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలను ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్' మరో మైలు రాయిగా నిలువబోతోంది. -
షారుక్ ఖాన్‌కు యష్ చోప్రా మెమోరియల్ అవార్డు
-
నా కెరీర్ నిలబెట్టిన వ్యక్తి ఆయన
‘‘షారుక్ ఖాన్‌కు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉంది. ఏప్రిల్ 8న వైజాగ్‌లో జరపనున్న టీయస్సార్– టీవీ9 నేషనల్ ఫిలిం అవార్డు వేడుకలో ఆయనకు ‘మిలీనియమ్ స్టార్ అవార్డు’ను కూడా అందజేయనున్నాం’’ అని కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. ‘సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్’ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన వేడుకలో హిందీ నటుడు షారుక్ ఖాన్‌కు ‘యశ్ చోప్రా మెమోరియల్’ అవార్డును ప్రదానం చేశారు. షారుక్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘చూడ్డానికి నేను అంత బాగుండను. అందుకని లవర్ బాయ్ కావాలనుకోలేదు. రొమాంటిక్ పాత్రలు చేసేంత అందగాణ్ణి కాదనుకునేవాణ్ణి. కానీ, యశ్ చోప్రా ‘నువ్వు లవ్‌స్టోరీస్ చేయకపోతే నీ కెరీర్ ఎదగదు’ అనేవారు. ఆయనలాంటి వ్యక్తి చెబితే దాంట్లో కచ్చితంగా అర్థం ఉంటుంది. నాతో లవ్‌స్టోరీస్ తీసి, నా కెరీర్‌ని నిలబెట్టారాయన’’ అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు, నటుడు శత్రుఘ్న సిన్హా, నటీమణులు రేఖ, జయప్రద, పద్మినీ కోల్హాపురి, మాధురీ దీక్షిత్‌లతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
'ఆయనే ప్రేమించటం నేర్పించారు'
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ గ్లామర్ క్వీన్ రేఖ, యష్ చోప్రా స్మారక అవార్డును అందుకున్నారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ను అందజేశారు. కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఈ అవార్డు కమిటీలో పమెలా చోప్రా, సిమీగేర్ వాల్, బోనీ కపూర్, జయప్రద, పింకీ రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. వీరంతా సినీరంగానికి రేఖ చేసిన సేవలకు గాను ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జ్యూరి సభ్యులతో పాటు డేవిడ్ ధావన్, పూనమ్ దిల్లాన్, మోహన్ బాబు, గుల్షన్ గ్రోవర్, శతృఘ్నసిన్హా లు పాల్గొన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా రేఖ, యష్ చోప్రాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్స్‌లో ఒకటైన 'సిల్సిలా' సినిమాను యష్ చోప్రా దర్శకత్వంలోనే నటించినట్లు తెలిపింది. ఆ సమయంలోనే ఆయన తనకు ప్రేమ అంటే ఏంటో తెలియచేశారని రేఖ పేర్కొంది. ఇది తన కెరీర్‌కు ముగింపు కాకపోయినా, ఎప్పటికీ గుర్తుండిపోయే బెస్ట్ ఛాప్టర్ అని తెలిపింది. 61 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ నేటి హీరోయిన్లకు పోటి ఇచ్చే గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న రేఖ ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదని, అవకాశాలు వచ్చినన్ని రోజులు సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది. -
రేఖకు యష్ చోప్రా స్మారక అవార్డు
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత యష్‌చోప్రా జ్ఞాపకార్థం టియస్ఆర్ ఫౌండేషన్ ప్రతియేటా ప్రతిష్ఠాత్మకమైన యష్‌చోప్రా స్మారక అవార్డు అందిస్తోంది. గతంలో అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్ లాంటి లెజెండ్స్ అందుకున్న ఈ అవార్డును ఈ ఏడాదికి గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖకు అందించనున్నారు. ఫిబ్రవరి 2న ముంబైలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ అవార్డ్ ప్రదానోత్సవం జరగనుంది. సినీరంగంలో విశేష సేవలందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది ఈ అవార్డులను అందిస్తున్నారు. ఇందులోభాగంలో అవార్డు గ్రహీతలకు స్వర్ణ పతకంతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతిని కూడా అందిస్తారు. జ్యూరీ సభ్యులుగా ఉన్న హేమమాలిని, జయప్రద, బోనీ కపూర్, సుబ్బిరామిరెడ్డి అలనాటి బాలీవుడ్ నటి రేఖను ఈ ఏడాది యష్‌చోప్రా అవార్డ్‌కు ఎంపిక చేశారు.