ప్రధాని నరేంద్ర మోదీ దిల్‌ఖుష్‌గా తన ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘అంతర్దృష్టి ఉన్న వ్యక్తిని, అత్యంత చురుకైన వ్యక్తిని కలిశానంటూ’ మంగళవారం ట్విటర్‌లో ఆయన ఓ ఫొటో పోస్ట్ చేశారు. సింప్లిసిటీకి, స్టాక్ మార్కెట్‌లో సంచలనాలకు కేరాఫ్ అయిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించే ఇదంతా.
దేశ ప్రధాని మోదీ, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను మంగళవారం కలిశారు. భారత ఆర్థిక వ్యవస్థలో అగ్రపథాన దూసుకుపోతున్న ఈయన్ని కలవడం సంతోషంగా ఉందని చెప్పారు మోదీ. రాకేష్‌తో పాటు ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా సైతం ఆ ఫొటోలో ఉండడం విశేషం. నలిగిన చొక్కాతో చాలా సాదాసీదాగా ఝున్‌ఝున్‌వాలా కనిపించిన ఫొటో ఒకటి, మరో ఫొటోలో ఝున్‌ఝున్‌వాలా కుర్చీలో కూర్చోగా.. తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ ఎదురుగా వినయంగా మోదీ చేతులు కట్టుకుని ఉన్న ఫొటో ట్విటర్‌లో షేర్ అయ్యి ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
Delighted to meet the one and only Rakesh Jhunjhunwala...lively, insightful and very bullish on India. pic.twitter.com/7XIINcT2Re
— Narendra Modi (@narendramodi) October 5, 2021
Look who is standing …Power of stock-market! #RakeshJhunjhunwala 🔥 pic.twitter.com/kGsiDGnpOY
— Mr. Singh (@MrSingh20201) October 5, 2021
ఇక లాభాల కోసం ఎక్కడో అమెరికా కంటే సొంత దేశంలో(భారత్) పెట్టుబడులు పెట్టాలంటూ ఇన్వెస్టర్లకు ఝున్‌ఝున్‌వాలా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయన్ని అభినందించినట్లు సమాచారం. పనిలో పనిగా కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలతోనూ మోదీ సమావేశమైనట్లు తెలుస్తోంది. ‘‘ఇంట్లో తిండి దొరుకుతుంటే బయట తినడం ఎందుకు? భారత్‌ను నమ్మండి. పెట్టుబడులు పెట్టండి’’ అంటూ ఝున్‌ఝున్‌వాలా జూన్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.
ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ ఇండియా రిచ్ జాబితాలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అండ్ ఫ్యామిలీ ఆస్తుల విలువ 22,300 కోట్ల రూపాయలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment