బిగ్‌బీ ఫోటో చూడగానే రేఖ రియాక్షన్‌..! | Watch, Rekhas reaction after she poses in front of Amitabh Bachchans photo | Sakshi
Sakshi News home page

బిగ్‌బీ ఫోటో చూడగానే రేఖ రియాక్షన్‌..!

Published Wed, Jan 30 2019 6:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రేఖ ఒకప్పటి హిట్‌పెయిర్‌. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందనీ, కానీ చివరకు అది బెడిసికొట్టిందని బీటౌన్‌లో అందరికీ తెలిసిందే. తను ఉన్న చోట బిగ్‌బీ కనబడితే.. అక్కడినుంచి రేఖ వెళ్లిపోతుంటుంది. తాజాగా డబూ రత్నాని క్యాలెండర్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన రేఖకు ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది.ఈ ఈవెంట్‌కు వెళ్లిన రేఖ.. మీడియా ఫోటోగ్రాఫర్స్‌కు ఫోజులిస్తుండగా.. వెనకాల బిగ్‌బీ పోస్టర్‌ ఉంది. అది చూసిన వెంటనే రేఖ.. హుటాహుటిన అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement