
అక్టోబర్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1.
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
రాజమౌళి (దర్శకుడు) రేఖ (నటి) అలి (నటుడు)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యసంబంధ సంఖ్య కావడం వల్ల వీరికి ఈ సంవత్సరం వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. పుష్కలంగా ధనం చేతికందుతుంది. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటమే కాదు, వాటిని తమ ఉన్నతికి ఉపయోగించుకో గలుగుతారు. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం ప్రాప్తి కలుగుతుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. వయసు పై బడుతున్నా, హుషారుగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. వీరి పుట్టిన తేదీ 10. ఇది కూడా సూర్యునికి సంబంధించినది కావడం వల్ల స్వతస్సిద్ధంగా వీరికి నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి. అయితే కంటిజబ్బులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, ఎల్లో, సిల్వర్, గోల్డెన్
సూచనలు: రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం, తండ్రిని, తత్సమానులను గౌరవించడం, తోబుట్టువులను ఆదరించడం మంచిది.
డాక్టర్ మహమ్మద్ దావూద్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్