
దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది హీరోలకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి. కథ ఏదైనా.. హీరో ఎవ్వరైనా సరే బాక్సాఫిస్ బద్దలు కావల్సిందే. 24 ఫ్రేమ్స్ ఉన్న సినిమా విభాగాల్లో తన మార్క్ ను చూపించే ఛత్రపతి. సినిమా అంటే కేవలం హీరో, కథ మాత్రమే కాదు.. క్రియేటివిటీ అని చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి.
ఇండస్ట్రీలో ఉండే 24కాప్ట్ర్ మీద పట్టున్న విక్రమార్కుడు రాజమౌళి. ఈగ ని హీరోని చేసిన ఘనత ఆయనదే. చేసింది కొన్ని సినిమాలే అయినా.. వందల సినిమాలు చేసినంత పేరు వచ్చింది. నేడు(అక్టొబర్ 10) రాజమౌళి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌పై స్పెషల్ స్టోరీ మీకోసం..