ఎత్తు ఎక్కువగా ఉన్న కారణంగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
ఎత్తు ఎక్కువగా ఉన్న కారణంగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గురువారం వెలుగుచూసింది. వివరాలు...స్థానికంగా నివాసముంటున్న లోలపు రేఖ(20) అనే యువతి ఇంటర్ వరకూ చదువుకుని, టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెకు వివాహ సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. యువతి ఎత్తుగా ఉండటం వల్ల సంబంధాలేవి కుదరడం లేదు. దీంతో కొన్ని రోజులుగా యువతి వివాహ విషయమై మనస్తాపానికి గురవుతుంది. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఈ యువతి, తల్లిదండ్రులు బాధపడటం భరించలేకపోయింది. తన పెళ్లి విషయం కుటుంబానికి బరువుగా భావించిన ఆ యువతి, ఇంట్లో ఎవరూ లేని సమయంలోఫ్యాన్‌కు ఉరేసుకునిమృతిచెందింది.
తల్లి ఉపాధి పనులకు, తండ్రి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది.ఉపాధి పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి కూతురు ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.