
అందానికి అరవయ్యేళ్లు..
బాలీవుడ్‌లో దాదాపు రెండు దశాబ్దాలు వెండితెర వెలుగుగా రాణించిన రేఖకు శుక్రవారం నాటితో అరవయ్యేళ్లు నిండాయి.
బాలీవుడ్‌లో దాదాపు రెండు దశాబ్దాలు వెండితెర వెలుగుగా రాణించిన రేఖకు శుక్రవారం నాటితో అరవయ్యేళ్లు నిండాయి. పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలూ జరుపుకోవడం లేదని ఆమె ఒక రేడియో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రతిరోజూ తనకు ప్రత్యేకమైనదేనని, రోజూ విభిన్నంగా జీవించడానికి ప్రయత్నిస్తానని, గుడికి వెళతానని తెలిపింది. సౌందర్య రహస్యం గురించి ప్రశ్నిస్తే... తన తల్లిదండ్రులు పుష్పవల్లి, జెమినీ గణేశన్‌ల నుంచి వచ్చిన వారసత్వమే తన అందానికి... ప్రేక్షకుల ఆదరాభిమానాలు తనలోని ఉత్సాహానికి కారణాలని చెప్పుకొచ్చింది.