
వెంకటేశ్వర్లు మృతదేహం
భార్య కాపురానికి రావడం లేదని భర్త బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అనాసాగరంలో శనివారం చోటుచేసుకుంది.
నేలకొండపల్లి: భార్య కాపురానికి రావడం లేదని భర్త బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అనాసాగరంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏటుకూరి వెంకటేశ్వర్లు (35)కు నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన రేఖతో పదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఓ కుమారుడు, కూతురు సంతానం. కుటుంబ తగాదాల వల్ల భార్య ఇంటికి వెళ్లిపోయింది. మనోవేదనకు గురైన భర్త మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం సాయంత్రం వరకు అందరితో కలిసి ఉన్నాడు.
శనివారం తెల్లవారేసరికి మండలంలోని పైనంపల్లిలో ఓ వ్యవసాయబావిలో శవమై కనిపించాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి కుటుంబసభ్యులకు విషయాన్ని చేరవేశారు. నేలకొండపల్లి హౌస్ ఆఫీసర్ ఎల్.బాలస్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు.