
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌డౌన్ సమయంలో లక్ష మందికి పైగా వలస కార్మికులకు అండగా నిలిచిన రేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టెన్నిస్ క్రీడాకారిణి రేఖ బోయలపల్లికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఈ మేరకు విశ్వగురు సంస్థ ఇంటర్నేషనల్ కరోనా వారియర్ అవార్డును రేఖా బోయలపల్లికి అందజేసింది. పలు రాష్ట్రాలకు చెందిన వలస కూలీల కుటుంబాలు హైదరాబాద్‌లో చిక్కుకుపోవడంతో వారందరికీ రేఖ నిత్యం భోజన ప్యాకెట్లను, నిత్యావసర సరుకులను, బాలింతలకు కిట్లను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే సొంత ఖర్చుతో బస్సులు, వ్యాన్లు ఏర్పాటు చేసి కూలీలను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అహర్నిశలు శ్రమించారు. ఈ అవార్డు లభించడం పట్ల పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment