గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్‌ | Rekha Vedavyas Latest Look Goes Viral | Sakshi
Sakshi News home page

Heroine Rekha: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్‌, షాక్‌లో ఫ్యాన్స్‌.. అనారోగ్య సమస్యలే కారణమా?

Published Thu, Sep 14 2023 10:57 AM | Last Updated on Thu, Sep 14 2023 11:25 AM

Rekha Vedavyas Latest Look Goes Viral - Sakshi

రేఖ వేదవ్యాస్‌.. 2001లో తెలుగు తెరకు పరిచయమైంది. ఆనందం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సక్సెస్‌ను, పేరుప్రఖ్యాతలను సంపాదించింది. జాబిలి, ఒకటో నెంబర్‌ కుర్రాడు, దొంగోడు, అనగనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి సినిమాలతో తెలుగువారికి దగ్గరైంది. అయితే కన్నడలో వరుసపెట్టి సినిమాలు చేసి అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

2014 తర్వాత మరే సినిమాలోనూ కనిపించని ఈ బ్యూటీ ఆ మధ్య ఓ షోలో బొద్దుగా కనిపించింది. తాజాగా మరోసారి బుల్లితెరపై అడుగుపెట్టింది రేఖ. వేణు తొట్టెంపూడితో కలిసి ఓ షోలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెను చూసి అందరూ షాకవుతున్నారు. కళ తప్పి బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి వచ్చింది. ఆమెను చూసి నటి ఇంద్రజ సైతం షాకైంది. మిమ్మల్ని చూడగానే విపరీతమైన సంతోషం.. అలాగే చాలా షాకయ్యాను అంది.

దీనికి రేఖ బదులిస్తూ.. అనుకోకుండా అలా జరిగిపోయింది అంటూ దేని గురించో మాట్లాడింది. బహుశా ఏదైనా అనారోగ్య కారణాల వల్లే ఆమె ఇలా బక్కచిక్కి పోయి ఉండవచ్చని తెలుస్తోంది. ఏదేమైనా రేఖను ఇలా చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రేఖ ఏ సమస్యతోనైనా బాధపడుతూ ఉండుంటే త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

చదవండి: శృంగార తారగా ముద్రపడ్డ నటి జీవితంపై వెబ్‌ సిరీస్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement