చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని ముత్యాలరెడ్డిపల్లి హరిపురం కాలనీలో రేఖ(24) అనే యువతి గురువారం ఉదయం హత్యకు గురైంది.
తిరుపతిలో యువతి హత్య
Nov 17 2016 3:26 PM | Updated on Aug 1 2018 2:19 PM
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని ముత్యాలరెడ్డిపల్లి హరిపురం కాలనీలో రేఖ(24) అనే యువతి గురువారం ఉదయం హత్యకు గురైంది. ఇంటి సమీపంలోని గడ్డివామి వద్ద యువతి మృతదేహం పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముత్యాలరెడ్డిపల్లె పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హంతకుల కోసం గాలిస్తున్నారు. హత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement