సాక్షి,ముంబై: టైటన్ లాభాల పంటతో ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా ఝున్‌ఝన్‌వాలా సంపద భారీగా ఎగిసింది. శుక్రవారం నాటి నష్టాల మార్కెట్‌లోటైటన్ షేరు భారీగా లాభపడింది. టాటా గ్రూప్‌నకు చెందిన టైటన్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పబ్లిక్ షేర్‌హోల్డర్, దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝన్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝన్‌వాలా నెట్‌వర్త్‌లో దాదాపు రూ. 500 కోట్ల మేర అదనంగా చేరింది.
టైటన్‌లో ఝున్‌ఝున్ వాలాకు 5.29 శాతం ఉంది. రాకేష్ అమితంగా ఇష్టపడే, మల్టీబ్యాగర్ టాటా గ్రూప్ స్టాక్ టైటాన్ ఈ స్టాక్ శుక్రవారం ఇంట్రాడేలో కొత్త 52 వారాల గరిష్ఠ ఈ స్టాక్ ధర రూ.105.40 మేర పెరిగింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత, జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం టైటాన్ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లోకి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే 3.39 శాతం పెరిగి రికార్డు గరిష్ట స్థాయి రూ.3,211చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ హై లెవెల్ రూ. 2,85,077 కోట్లకు చేరింది. గత సెషన్‌లో రూ. 275,720 కోట్ల నుంచి రూ.9,357 కోట్లు పెరిగింది. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?)
టైటన్ షేరు ఏడాది కాలంలో ఏకంగా 50 శాతానికి పైగా పెరిగింది. జూలై 7, 2022 నాటికి బీఎస్‌సీలో రూ.2128 గా ఉన్న షేర్లు. శుక్రవారం కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.3211.10ని తాకింది. అంటే 2023లో టైటన్ షేర్లు 25 శాతం మేర లాభపడ్డాయన్నమాట. ఫలితంగా 5.29 శాతం వాటా ఉన్న ఝన్ ఝన్ వాలా రూ.494 కోట్ల విలువైన నోషనల్ లాభాలు ఆర్జించారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?)
టైటన్ కీలక వ్యాపారాలు రెండంకెల వృద్ధిని సాధించి క్యూ1లో ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. టైటన్ ప్రధాన ఆభరణాల వ్యాపారం సంవత్సరానికి 21 శాతం వృద్ధితో ఆకట్టుకుంది. టైటాన్ వాచీలు & వేరబుల్స్ విభాగం 13 శాతం వార్షిక వృద్ధిని, అనలాగ్ వాచీల విభాగంలో 8 శాతం వృద్ధిని, ఇతరాల్లో 84 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ విస్తరణలో భాగంగా గత త్రైమాసికంలో మొత్తం 18 స్టోర్‌లతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 559 చేరింది.
Comments
Please login to add a commentAdd a comment