ఆ హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా? | No, Rekha And Sanjay Dutt Aren't Married | Sakshi
Sakshi News home page

ఆ హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా?

Published Mon, Mar 6 2017 8:49 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

ఆ హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా?

ఆ హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా?

ముంబై: బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రేఖ పెళ్లి చేసుకున్నారా? రేఖ జీవిత చరిత్ర 'రేఖ-ద అన్‌టోల్డ్‌ స్టోరీ'లో ఈ విషయాన్ని ప్రస్తావించారా? రేఖ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రేఖ-ద అన్‌టోల్డ్‌ స్టోరీ రచయిత యాసిర్ ఉస్మాన్ స్పందిస్తూ.. ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. పుస్తకంలో రేఖ-సంజయ్‌ల పెళ్లి విషయం గురించి రాయలేదని, పాఠకులు సమగ్రంగా చదవలేదని చెప్పాడు.

'1984లో సంజయ్ దత్, రేఖ కలసి ఓ సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్టు అప్పట్లో రూమర్లు వచ్చాయి. రేఖ, సంజయ్ పెళ్లి కూడా చేసుకున్నారని కొందరు చెప్పుకొన్నారు. ఓ ఇంటర్వ్యూలో సంజయ్ ఈ వార్తను ఖండించేందుకు నిరాకరించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని  అందరూ నమ్మారు' అని రేఖ జీవిత చరిత్రలో ఉస్మాన్ రాశాడు. రేఖతో పెళ్లి వార్తను సంజయ్ ఖండించకపోయినా.. ఇది అవాస్తవమని ఉస్మాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ సమయంలో సంజయ్‌కు రేఖ సాయంగా ఉండటంతో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్టు భావించారని, పెళ్లి వార్తను అప్పట్లో ఆయన ఖండించి ఉంటే బాగుండేదదని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement