రేఖలా నటించడం అసాధ్యం | Khoobsurat trailer: Sonam Kapoor's spin on Rekha's film | Sakshi
Sakshi News home page

రేఖలా నటించడం అసాధ్యం

Published Mon, Jul 21 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

Khoobsurat trailer: Sonam Kapoor's spin on Rekha's film

 సీనియర్ నటి రేఖ నటనను తలపింపజేయడం తన వల్ల అయ్యే పనికాదని తెలుసని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వ్యాఖ్యానించింది. రేఖ హీరోయిన్‌గా నటించిన ‘ఖూబ్‌సూరత్’ సినిమా రీమేక్‌లో సోనమ్‌కపూర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. పాత సినిమాలో రేఖ నటించినట్లు ఇప్పుడు తాను నటించగలనని చెప్పడం అతిశయోక్తి అవుతుందని సోనమ్ వ్యాఖ్యానించింది. పాత ఖూబ్‌సూరత్ సినిమాలో రేఖ నటన అద్భుతం.. అందులో ఆమె హావభావాలు, వేషధారణ, నటన ప్రేక్షకులను కట్టిపడేశాయని సోనమ్ కితాబు ఇచ్చింది. కాగా కొత్త ‘ఖూబ్‌సూరత్’ ట్రయలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సోనమ్ మాట్లాడుతూ రేఖతో తన నటనను పోల్చవద్దని కోరింది.
 
 ‘రిషికేష్ సినిమాల్లో ఎక్కువ శాతం సందేశంతో కూడిన హాస్యభరిత సినిమాలే.. అవి ఆద్యంతం నవ్విస్తూనే ఎంతో కొంత ఆలోచింపజేసేలా ఉండేవి..’ అని చెప్పింది. ప్రస్తుతం అలాంటి సినిమాలను రాజు హిరానీ నిర్మిస్తున్నాడని సోనమ్ వ్యాఖ్యానించింది. కాగా, ఖూబ్‌సూరత్‌లో హీరోయిన్ పాత్ర ఆలోచన విధానం, ఆహార్యం నిజజీవితంలో తన వ్యక్తిత్వాన్ని పోలి ఉంటుందని సోనమ్ చెప్పింది. చాలావరకు తాను బయట ఎలా ప్రవర్తిస్తానో ఈ సినిమాలో ‘మిలీ’(పాత్ర పేరు) కూడా అలాగే ప్రవర్తిస్తుందని ఆమె అంది. తనలోని నటనను ఈ సినిమాలో నిర్మాత, డెరైక్టర్లు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారని వ్యాఖ్యానించింది.
 
 ఈ సినిమా సెప్టెంబర్ 19న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దీని కోసం తాను ఎంతో ఎదురుచూస్తున్నానని సోనమ్ చెప్పింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ప్రముఖ పాకిస్థానీ నటుడు, గాయకుడు ఫవాద్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేశారు. అలాగే కిరణ్ ఖేర్, రత్నా పాఠక్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర లు పోషించారు. డిస్నీ, సోనమ్ సోదరి రియా కపూర్, తండ్రి అనిల్ కపూర్ సంయుక్తంగా దీనిని నిర్మించారు. శశాంఖ్ ఘోష్ దర్శకత్వం వహించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement