అనవసరంగా భూతద్దంలో చూపెట్టొద్దు | Sonam Kapoor to star in `Khoobsurat` remake | Sakshi
Sakshi News home page

అనవసరంగా భూతద్దంలో చూపెట్టొద్దు

Published Tue, Jun 10 2014 10:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అనవసరంగా భూతద్దంలో చూపెట్టొద్దు - Sakshi

అనవసరంగా భూతద్దంలో చూపెట్టొద్దు

 ‘‘నాకు డబ్బు కాదు ముఖ్యం. పేరు ప్రఖ్యాతులు ముఖ్యం. దర్శకురాలు అవుదామని ఈ రంగంలోకొచ్చాను. అనుకోకుండా కథానాయిక అయ్యాను. ప్రస్తుతం నటిగా నా ముందున్న లక్ష్యం ఒక్కటే... మా నాన్న పేరును నిలబెట్టడం. డబ్బు కోసం అడ్డమైన పాత్రలూ పోషించను. నాన్న ఖ్యాతికి మచ్చ తెచ్చేలా స్కిన్‌షో చేయను’’... కెరీర్ తొలినాళ్లలో సోనమ్ కపూర్ చెప్పిన మాటలు ఇవన్నీ. అయితే... వాటిని నిలబెట్టుకునే పరిస్థితి ప్రస్తుతం సోనమ్‌కి కనిపించడం లేదు. విజయాలు ఆలస్యంగా వరించడంతో నిదానంగా స్కిన్‌షో చేయడం మొదలుపెట్టారామె. బాలీవుడ్‌లోని టాప్‌హీరోయిన్లకు తీసిపోని స్థాయిలో గ్లామర్‌ని ఒలకబోస్తూ, ఎట్టకేలకు విజయాలు అందుకుంటున్నారు సోనమ్.
 
  రాన్‌జానా, బాగ్ మిల్కా బాగ్ చిత్రాలు ఆమెకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ‘ఖూబ్‌సూరత్’ చిత్రంలో నటిస్తున్నారు సోనమ్. 1980లో అశోక్‌కుమార్, రేఖ నటించిన ‘ఖూబ్‌సూరత్’ చిత్రానికి ఇది రీమేక్. రేఖ పోషించిన పాత్రను ఇప్పుడు సోనమ్ పోషిస్తున్నారు. ఇక అసలు విషయానికొద్దాం... ఈ చిత్రంలోని సోనమ్ స్టిల్స్‌ని ఇటీవలే విడుదల చేశారు. వీటిల్లో సోనమ్ మరీ స్పైసీగా కనిపించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఒంటిపై ఆచ్ఛాదనను చాలావరకు తప్పించి, పోర్న్‌స్టార్‌లా రెచ్చిపోయారు సోనమ్. ఈ సినిమా నిర్మాతల్లో సోనమ్ తండ్రి అనిల్‌కపూర్ కూడా ఒకరు కావడంతో బాలీవుడ్‌లో విమర్శలు పోటెత్తాయి.
 
 ఆ స్టిల్స్‌తో మీడియా కథనాలు కూడా ప్రసారం చేయడం మొదలుపెట్టింది. దాంతో సోనమ్‌కు వివరణ ఇవ్వక తప్పలేదు. ‘‘వృత్తి ధర్మాన్ని బట్టి మనిషి నడుచుకోవాలనేది నా సిద్ధాంతం. నాన్న నాకు చిన్నప్పట్నుంచీ నేర్పింది అదే. స్కిన్‌షో చేయాలని ఏ స్త్రీ కోరుకోదు. నేను నటిని. పాత్రను బట్టి నడుచుకోవాలి. అందుకే అలా నటించాల్సి వచ్చింది. నాన్న నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రంలో నేను అలా నటించానంటే, దానికి ఎంత బలమైన కారణం ఉండి ఉండాలో అర్థం చేసుకోండి. దాన్ని అనవసరంగా భూతద్దంలో చూపెట్టొద్దు’’ అని వాపోయారు సోనమ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement