మన పొట్టేమీ చెత్తబుట్ట కాదు! | rekha Day activity | Sakshi
Sakshi News home page

మన పొట్టేమీ చెత్తబుట్ట కాదు!

Aug 21 2014 12:04 AM | Updated on Sep 2 2017 12:10 PM

మన పొట్టేమీ చెత్తబుట్ట కాదు!

మన పొట్టేమీ చెత్తబుట్ట కాదు!

అరవైకి దగ్గర పడినా... ఏ మాత్రం తరగని సౌందర్యం రేఖ సొంతం. ఆమె అందం వెనుకున్న రహస్యాలేంటి? అసలు రేఖ దినచర్యలేంటి? ఆ వివరాలేంటో చూద్దామా...

అరవైకి దగ్గర పడినా... ఏ మాత్రం తరగని సౌందర్యం రేఖ సొంతం. ఆమె అందం వెనుకున్న  రహస్యాలేంటి? అసలు రేఖ దినచర్యలేంటి? ఆ వివరాలేంటో చూద్దామా...
 
  ప్రతి రోజూ పది నుంచి పన్నెండు గ్లాసులు నీళ్లు తాగుతారు. రేఖ చర్మం నిగనిగలకు అదొక కారణం. రాత్రి వీలైనంత త్వరగా అంటే.. దాదాపు తొమ్మిది గంటలకే నిద్రపోయి, తెల్లవారుజాము ఐదు గంటలకు లేవడం రేఖ అలవాటు. నిద్ర తక్కువైతే అనారోగ్యం పాలైనట్లే అంటారామె.
 
  అందాన్ని కాపాడుకోవడానికి పాత పద్ధతులనే ఆచరిస్తారామె. ఆయుర్వేదిక్ స్పా ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. దీనికోసం ఏ బ్యూటీ పార్లర్‌కీ వెళ్లరు. ఆయుర్వేద, అరోమాథెరపీలను ఇంట్లోనే చేయించుకుంటారు.
 
  బాలీవుడ్‌లో ‘ఆయిల్ బేస్డ్’ మేకప్ మొదలైంది రేఖతోనే. అంతకు ముందు తారలందరూ డ్రై మేకప్‌ని వాడేవారు. దానికన్నా చర్మానికి ఆయిల్ బేస్డ్ మేకప్పే మంచింటారు రేఖ. ఏ తారలకైనా ప్రత్యేకంగా మేకప్ కళాకారులు ఉంటారు. కానీ, రేఖ మాత్రం తనే మేకప్ చేసుకుంటారు.
 
  ప్రతి రోజూ పది నుంచి పదిహేను నిమిషాలు తేలికపాటి వ్యాయామాలు చేస్తారు. దానివల్ల శరీరం ఫిట్‌గా ఉంటుందని చెబుతారు రేఖ. యోగా అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టం. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా చేస్తున్నారు. రోజూ తప్పనిసరిగా ధ్యానం చేస్తారు.
 
  రేఖకు డాన్స్ అంటే ఇష్టం. వీలు కుదిరినప్పుడల్లా ఇంట్లోనే డాన్స్ చేస్తుంటారు. ఇంకా గార్డెనింగ్ చేస్తారు. బరువు పెరగకుండా నియంత్రించడానికి ఇవి కూడా ఓ కారణం అంటారామె.
 
  రేఖ దృష్టిలో మాంసాహారం కన్నా శాకాహారమే మిన్న. అందుకే ఆకు కూరలు బాగా తీసుకుంటారు. అలాగే, డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా, వాల్‌నట్స్ చాలా మంచివని చెబుతారామె. పండ్లలో దానిమ్మ, స్ట్రాబెర్రీలను ఎక్కువగా తీసుకుంటారు.
 
  ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ముఖ్యం అంటారు రేఖ. ఏం తింటున్నాం? ఏ వేళకు తింటున్నాం అన్నది ప్రధానమంటారామె. ఎప్పుడు పడితే అప్పుడు కంటికి కనిపించిందల్లా కడుపులోకి తోయడానికి అదేం చెత్తబుట్ట కాదని కూడా అంటారు రేఖ. మితాహారమే మిన్న అని చాలా స్ట్రాంగ్‌గా చెబుతారు రేఖ.
 
 జుత్తు కోసం ప్రత్యేకంగా ఇంట్లోనే హెయిర్ ప్యాక్ తయారు చేసుకుంటారామె. ఉసిరి, షికాయ, మెంతులు, కొబ్బరి నూనె కలిపి మెత్తగా పేస్ట్‌లా తయారు చేసి, జుత్తుకు పట్టిస్తారు. ఒక్కోసారి పెరుగు, ఎగ్ వైట్, తేనె కలిపిన ప్యాక్‌ను వాడతారు. తడిగా ఉన్నప్పుడు జుత్తుని అస్సలు దువ్వరు. అలాగే, జుత్తును ఆరడానికి డ్రైయర్లు వాడరు. సహజంగా ఆరబెడతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement