
తెలుగులో అప్పట్లో 'రుద్రనేత', 'కొండపల్లి రాజా' సినిమాల్లో నటించిన రేఖ.. ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ భాషలకే పరిమితమైంది. మరోవైపు సీరియల్, షోల్లో కనిపిస్తూ అలరిస్తోంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'మిరియం మా'. ఐర్లాండ్ కి చెందిన మాలతి నారాయణన్ దర్శకురాలు. ఆమెనే ఈ చిత్రానికి నిర్మాత కూడా.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)
త్వరలో ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో గురువారం ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రేఖ.. హీరోయిన్ల జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను 35 ఏళ్లుగా నటిస్తున్నా. మొదట్లో హీరోయిన్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రలు చేశాను. నేను చేసిన చిత్రాల్లోని పాత్రల పేర్లతో నన్ను పిలుస్తుండడం సంతోషంగా ఉంది'
'ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన లేడీ యాక్టర్స్‌ని దర్శకులు పక్కన పెట్టేస్తున్నారు. కానీ నాలాంటి చాలామందికి మంచి పాత్రల్లో నటించాలనే కోరిక ఉంటుంది. నేను మాత్రం బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటాను. ఒకప్పుడు హీరోయిన్లకు నటించడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లకు అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది' అని రేఖ తన ఆవేదన చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!)
Comments
Please login to add a commentAdd a comment