ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రేఖా ఝున్‌ఝన్‌వాలా ఈ రోజు తన నికర విలువలో గణనీయమైన వృద్దిని సాధించారు. అందుకు టాటా మోటార్స్ స్టాక్ పనితీరుతో పాటు జూన్ త్రైమాసిక ఫలితాలే కారణమని తెలుస్తోంది. రేఖా కొనుగోలు చేసిన టాటా షేర్లు బుధవారం 4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40ను తాకింది. వెరసీ ఒక్కరోజే 132 కోట్లకు పైగా సంపాదించారు.
రేఖా ఝున్ ఝున్ వాలా టాటా మోటార్స్‌లో 52,256,000 షేర్లు ఉన్నాయి. మంగళ వారం రోజు షేరు రూ.639.45 వద్ద క్లోజ్ అయినప్పుడు ఆమె హోల్డింగ్ విలువ రూ.3,341.50 కోట్లుగా ఉంది. బుధవారం రూ.665.40కు పెరగడంతో ఆమె షేరు విలువ రూ.3,477.11 కోట్లకు పెరిగింది.
టాటా మోటార్స్ ఫలితాలు
టాటా గ్రూప్ కంపెనీ విశ్లేషకులను, ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వ్యాపార పనితీరుతో బలహీనంగా ఉన్న త్రైమాసికంలో కంపెనీ పనితీరు అంచనాలను అధిగమించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. జేఎల్ఆర్ వ్యాపారం మరింత వృద్ధిని, లాభదాయకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment