న్యూఢిల్లీ: పార్లమెంటుకు రావడం ఇష్టం లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సమాజ్‌వాదీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎట్టకేలకు సమావేశాలకు హాజరయ్యారు. ఆయనతోపాటు బాక్సర్ మేరీ కోమ్ కూడా గురువారం సభకు వచ్చారు.
నామినేటెడ్ రాజ్యసభ సభ్యుల్లో సచిన్‌తోపాటు బాలీవుడ్ నటి రేఖకు హాజరుశాతం అత్యంత తక్కువగా ఉంది. రెండు రోజుల క్రితం సమాజ్‌వాదీ ఎంపీ నరేశ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘రేఖ, సచిన్‌లకు సభకు వచ్చేందుకు ఆసక్తి లేకపోతే వారు రాజీనామా చేయాలి’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యల అనంతరం సచిన్ పార్లమెంటుకు రావడం గమనార్హం.
ఎట్టకేలకు రాజ్యసభకు సచిన్
Published Fri, Aug 4 2017 4:15 AM | Last Updated on Mon, Sep 11 2017 11:11 PM
Advertisement
Advertisement