సినిమాల్లోకి రావాలని అనుకోలేదు: రేఖ | Film industry was not my choice: Rekha | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి రావాలని అనుకోలేదు: రేఖ

Published Mon, May 19 2014 1:39 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సినిమాల్లోకి రావాలని అనుకోలేదు: రేఖ - Sakshi

సినిమాల్లోకి రావాలని అనుకోలేదు: రేఖ

ఆరుపదుల వయసు మీద పడుతున్నా ఇప్పటికీ కుర్రహీరోయిన్లతో పోటీపడే స్థాయిలో ఉన్న నటీమణి .. రేఖ. దాదాపు 40 ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తూ అనేక మందిని ఉర్రూతలూగించిన ఈమె, అసలు సినిమాల్లోకే రావాలని అనుకోలేదట. కానీ ఒక్కసారి తిరిగి చూసుకుంటే మాత్రం సినిమాల్లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతోంది. రేఖ కెరీర్లో 'మిస్టర్ నట్వర్లాల్', 'ఉమ్రావో జాన్', 'సిల్సిలా'.. ఇలా అనేక బ్లాక్బస్టర్ విజయాలున్నాయి. ఇప్పుడు రేఖకు 59 ఏళ్లు. ఖూన్ భరీ మాంగ్ సినిమా సమయానికి తాను కేవలం నటిగా తప్ప మరేమీ చేయలేనన్న విషయం తెలిసిందని రేఖ చెప్పింది.

సుభాష్ ఘయ్ నిర్వహిస్తున్న 'సెలబ్రేట్ సినిమా' ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా రేఖ తన జీవితంపై,న, తన కెరీర్ పైన పలు అభిప్రాయాలు వెలిబుచ్చింది. 1966లో బాలనటిగా తెరంగేట్రం చేసిన రేఖ కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాలున్నాయి. ఉమ్రావో జాన్ సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమనటి అవార్డు కూడా వచ్చింది. ఇప్పటికీ తనకు సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయని, వాటిని తాను ఆశీర్వచనంలా భావిస్తున్నానని రేఖ చెప్పింది. అభిషేక్ కపూర్ హీరోగా వస్తున్న 'ఫితూర్' సినిమాలో రేఖ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement