పెళ్లికి వెళితే బహుమతులు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. సాధారణంగా డబ్బులను కట్నాలుగా రాపించడం.. లేదా ఏదైనా ఖరీదైన గిఫ్ట్‌లను అందజేస్తారు.అయితే ఈ మధ్య కాలంలో యువత వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ స్నేహితులు, బంధువుల పెళ్లిళ్లో చిన్నపిల్లల పాల బాటిళ్లు వంటి ఢిఫరెంట్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. తాజాగా తమిళనాడులోనూ కొంతమంది స్నేహితులు కొత్త దంపతులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.
ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వారంలో కనీసం నాలుగు రోజులు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ పెళ్లికి విచ్చేసిన అతిథులు వధూవరులకు పెట్రోల్, డీజిల్ నింపినబాటిళ్లను కానుకగా అందించారు. చెంగల్పట్టు జిల్లా చెయ్యూరుకు చెందిన గిరీశ్ కుమార్, కీర్తన పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి స్నేహితులు పెట్రోల్, డీజిల్‌ను లీటర్ బాటిళ్లలో నింపి, వాటిని వధూవరులకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా తమిళనాడులో గత 15 రోజుల్లో 9 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ. 110.85 ఉండగా, డీజిల్ ధర రూ. 100.94గా ఉంది.
చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది
Comments
Please login to add a commentAdd a comment