సాక్షి, న్యూఢిల్లీ : భారత్ వృద్ధికి అధిక ముడిచమురు ధరలు ప్రధాన అవరోధమని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. మూడీస్ ఇటీవల నిర్వహించిన మార్కెట్ పోల్స్‌లో 175 మంది ఇన్వెస్టర్లను పలుకరించగా వారంతా భారత వృద్ధి రేటుకు అధిక చమురు ధరలు ప్రధాన సవాల్‌గా చెప్పుకొచ్చారు. ద్రవ్య లోటును 3.3 శాతానికి కుదించే క్రమంలోనూ పలు రిస్క్‌లు పొంచిఉన్నాయని మూడీస్, ఐసీఆర్‌ఏ సింగపూర్, ముంబయిల్లో నిర్వహించిన సర్వేలో ఇన్వెస్టర్లు స్పష్టం చేశారు.
మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సమకూర్చే మూలధన ప్యాకేజ్ ఏమాత్రం సరిపోదని వారు పెదవివిరిచారు. ఇన్వెస్టర్ల అభిప్రాయాల తరహాలోనే అధిక చమురు ధరలు వృద్ధి రేటుకు ప్రధాన సవాల్‌గా తాము కూడా పరిగణిస్తున్నామని మూడీస్ పేర్కొంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలు ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 66 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అవి బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment