రూ. 3.56 వరకూ తగ్గనున్న డీజిల్ ధర | Rs. 3.56 to the price of diesel is cheaper | Sakshi
Sakshi News home page

రూ. 3.56 వరకూ తగ్గనున్న డీజిల్ ధర

Published Fri, Oct 17 2014 1:56 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM

రూ. 3.56 వరకూ తగ్గనున్న డీజిల్ ధర - Sakshi

రూ. 3.56 వరకూ తగ్గనున్న డీజిల్ ధర

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏకంగా నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో.. దేశంలో డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌పై చమురు సంస్థలకు నష్టాలు వచ్చే పరిస్థితి పోయి.. రెండు మూడు నెలలుగా లాభాలు రావడం ప్రారంభమైంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు సంస్థలకు ఒక్కో లీటర్ డీజిల్‌పై దాదాపు రూ. 3.56 వరకూ లాభం వస్తోంది. ఈ విషయాన్ని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి కూడా.

ఈ నెల తొలివారంలో ఒక్కో లీటర్‌పై రూ. 1.90 పైసల వరకూ లాభం రాగా... కొద్ది రోజుల్లోనే అది రెట్టింపు కావడం గమనార్హం. అయితే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండడంతో... డీజిల్ ధరలను తగ్గించలేదు. ఆదివారం ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం డీజిల్ ధరల తగ్గింపును ప్రకటించనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement