Haryana Assembly polls
-
సుష్మాస్వరాజ్ సోదరికి షాక్
న్యూఢిల్లీ: హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సోదరి వందనా శర్మ ఓటమిపాలయ్యారు. సాఫిడాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమెను స్వతంత్ర అభ్యర్థి జస్బీర్ దెశ్వాల్ కంగు తినిపించారు. 1,422 ఓట్ల తేడాతో వందనా శర్మ ఓడిపోయారు. హర్యానాలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ వందన ఓడిపోవడం గమనార్హం. తాజా సమచారం ప్రకారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు స్వతంత్రులు గెలుపొందారు. మొత్తం 513 మంది స్వతంత్రులు పోటీ చేశారు. -
రూ. 3.56 వరకూ తగ్గనున్న డీజిల్ ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏకంగా నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో.. దేశంలో డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌పై చమురు సంస్థలకు నష్టాలు వచ్చే పరిస్థితి పోయి.. రెండు మూడు నెలలుగా లాభాలు రావడం ప్రారంభమైంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు సంస్థలకు ఒక్కో లీటర్ డీజిల్‌పై దాదాపు రూ. 3.56 వరకూ లాభం వస్తోంది. ఈ విషయాన్ని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి కూడా. ఈ నెల తొలివారంలో ఒక్కో లీటర్‌పై రూ. 1.90 పైసల వరకూ లాభం రాగా... కొద్ది రోజుల్లోనే అది రెట్టింపు కావడం గమనార్హం. అయితే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండడంతో... డీజిల్ ధరలను తగ్గించలేదు. ఆదివారం ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం డీజిల్ ధరల తగ్గింపును ప్రకటించనున్నారు.