సుష్మాస్వరాజ్ సోదరికి షాక్
న్యూఢిల్లీ: హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సోదరి వందనా శర్మ ఓటమిపాలయ్యారు. సాఫిడాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమెను స్వతంత్ర అభ్యర్థి జస్బీర్ దెశ్వాల్ కంగు తినిపించారు. 1,422 ఓట్ల తేడాతో వందనా శర్మ ఓడిపోయారు.
హర్యానాలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ వందన ఓడిపోవడం గమనార్హం. తాజా సమచారం ప్రకారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు స్వతంత్రులు గెలుపొందారు. మొత్తం 513 మంది స్వతంత్రులు పోటీ చేశారు.