
అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత కిందికి దిగి వస్తున్నాయి. అమెరికా మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 6.50శాతం క్షీణించి 50.47 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో ఏడాది కనిష్టానికి చేరాయి. వారంలో రోజుల్లోనే ఏకంగా 11శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 40శాతానికి పైగా దిగివచ్చింది. ఆర్థికవృద్ధి మందగమన భయాలతో పాటు క్రూడ్ ఉత్పత్తి పెరుగుదలతో క్రూడాయిల్ పతనమైందని ఎనలిస్టులు చెపుతున్నారు.
మరోవైపు ఒపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిలో కోత విధింపుపై సందేహాలు తలెత్తడం కూడా క్రూడాయిల్ ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. భారీగా క్షీణిస్తున్న క్రూడాయిల్ ధరలను అదుపులో తెచ్చేందుకు రష్యా నేతృత్వంలోని ఒపెక్ దేశాలు జనవరి నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి కోతకు అంగీకరించిన సంగతి తెలిసిందే.
ప్రపంచదేశాల సూక్ష్మఆర్థిక వ్యవస్థ గణాంకాలుఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం, తగ్గుతున్నక్రూడ్ ఆయిల్ డిమాండ్, ఈనెలలోఈక్విటీ మార్కెట్లు 9.5శాతం క్షీణతతోపాటు, యూరోజోన్ రుణ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం తదితర అంశాలన్నీల క్రూడాయిల్ ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయని విశ్లేషకులంటున్నారు.