
సాక్షి, శ్రీకాకుళం: చమురు ధరల పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజల జేబులు కొడుతున్నాయని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చమురు ధరల పెరుగుదల వలన కొనుగోలు శక్తి తగ్గిపోతుందన్నారు. రెపోరేటుపై ప్రభావం చూపితే బ్యాంకింగ్ రంగం కుదేలైపోతుందని తెలిపారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైద్య వ్యవస్థ నిర్వీర్యం
మరో వైపు రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. శ్రీకాకులం ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి జ్యోతిక మృతి చెందిందని వెల్లడించారు. బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. గుంటూరు ఆస్పత్రిలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకుని ఉంటే.. మళ్లీ చిన్నారి మృతి ఘటన పునరావృతం అయ్యేది కాదన్నారు. పాముకాటుకు వైద్యం అందించ లేకుంటే మంత్రులు రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. చంద్రబాబు పాలనలో వైద్య వ్యవస్థ నిర్వీర్యమై పోయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment