రెమిటెన్స్ లు తగ్గుతాయ్
ప్రపంచ బ్యాంక్ అంచనా
వాషింగ్టన్: భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లు ఈ ఏడాది తగ్గుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. తక్కువ ముడిచమురు ధరలు సహా ఇండియాకు ఎక్కడి నుంచైతే రెమిటెన్స్ అధికంగా వస్తున్నాయో ఆయా ప్రాంతాల్లోని బలహీనమైన ఆర్థిక వృద్ధే రెమిటెన్స్‌ల తగ్గుదలకు ప్రధాన కారణంగా నిలుస్తుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం..
⇔ ఈ ఏడాది భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లు 5 శాతం క్షీణతతో 65.5 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతాయి.
⇔ రెమిటెన్స్‌లు స్వల్పంగా తగ్గినప్పటికీ ప్రపంచంలో రెమిటెన్స్‌లు స్వీకరణలో భారత్ టాప్‌లోనే కొనసాగుతుంది.
⇔ ఇండియా తర్వాతి స్థానంలో 65.2 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ల స్వీకరణతో చైనా రెండో స్థానంలో ఉంటుంది.
⇔ 20.3 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ల స్వీకరణతో పాకిస్తాన్ ఐదో స్థానంలో నిలువొచ్చు.
⇔ బంగ్లాదేశ్‌కు వచ్చే రెమిటెన్స్‌ల్లోనూ 3.5 శాతం క్షీణత నమోదు కావొచ్చు.
⇔ పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు వచ్చే రెమిటెన్స్‌లు వరుసగా 5.1 శాతం, 1.6 శాతం మేర పెరగొచ్చు.