Remittances
-
రూ.10 లక్షల కోట్లు! స్వదేశానికి మనోళ్లు పంపించిన నిధులివి..
వాషింగ్టన్: ప్రవాస భారతీయులు స్వదేశం పట్ల అపారమైన అభిమానం చాటుతున్నారు. కష్టార్జితాన్ని తాముంటున్న చోటే దాచుకోకుండా, స్వదేశానికి పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. స్వదేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మాతృభూమికి నిధులు పంపించడంలో (రెమిటెన్స్‌లు) ప్రపంచదేశాల్లోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు.2023లో 120 బిలియన్ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్‌లను భారత్ అందుకున్నట్టు ప్రపంచబ్యాంక్ తాజాగా ప్రకటించింది. అదే ఏడాది మెక్సికోకు వెళ్లిన 66 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లతో పోల్చిచూస్తే భారత్‌కు రెట్టింపు వచ్చినట్టు తెలిపింది. ఆ తర్వాత చైనాకు 50 బిలియన్ డాలర్లు, ఫిలిప్పీన్స్‌కు 39 బిలియన్ డాలర్లు, పాకిస్థాన్‌కు 27 బిలియన్ డాలర్ల రెమెటెన్స్‌లు వెళ్లాయి.భారత్‌కు 2023లో అత్యధికంగా అమెరికా, యూఏఈ నుంచే రెమిటెన్స్‌లు వచ్చాయి. సీమాంతర చెల్లింపులకు దీర్హామ్–రూపీలను అనుమతించడంతో అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే రెమిటెన్స్‌లు పెరిగినట్టు ప్రపంచబ్యాంక్ తెలిపింది. ఇక 2024 సంవత్సరంలో భారత్‌కు 3.7 శాతం అధికంగా 124 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లు రావచ్చని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. 2025లో మరో 4 శాతం పెరిగి 129 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది.భారత్ తన యూపీఐని యూఏఈ, సింగపూర్‌తో అనుసంధానించేందుకు చేపడుతున్న చర్యలు వ్యయాలను తగ్గిస్తుందని, ఇది రెమిటెన్స్‌లను మరింత వేగవంతం చేయవచ్చని తెలిపింది. వలసపోవడం, వారి ద్వారా స్వదేశానికి నిధుల తరలింపు అన్నది ఆర్థిక, మానవాభివృద్ధికి అత్యవసరమని ప్రపంచబ్యాంక్‌లో సామాజిక పరిరక్షణ విభాగం గ్లోబల్ డైరెక్టర్ ఇఫత్ షరీఫ్ పేర్కొన్నారు. -
World Migration Report 2024: భారత్‌కు మనవాళ్ల డబ్బేడబ్బు
ఐక్యరాజ్యసమితి: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తమ సంపాదనను పంపడంలో (రెమిటెన్స్) రికార్డు సృష్టించారు. భారత్‌కు ఈ తరహా నిధులు 2022లో 111.22 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనితో ఇంత భారీ స్థాయిని అందుకున్న తొలి దేశంగా భారత్ రికార్డులకు ఎక్కింది. నిజానికి రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లు దాటిన తొలి దేశంగా కూడా భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ మేరకు విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... » రెమిటెన్సులకు సంబంధించి భారత్ తరువాతి నాలుగు స్థానాల్లో మెక్సికో(61 బిలియన్ డాలర్లు), చైనా (51 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ నిలిచాయి. 2021లో చైనా స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది. » దక్షిణాసియా నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నందున ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతోంది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెమిటెన్సులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 21.5 బిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలుస్తోంది. » 44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. » విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా (8,33,000) ఉంది. తరువాతి స్థానాల్లో బ్రిటన్ (దాదాపు 6,01,000), ఆస్ట్రేలియా (దాదాపు 3,78,000), జర్మనీ (3,76,000 పైగా), కెనడా (దాదాపు 3,18,000) ఉన్నాయి.భారత్ పయనమిలా... (అంకెలు బిలియన్ డాలర్లలో) 2010 53.48 2015 68.91 2020 83.15 2022 111.22 -
మాతృదేశానికి తోడునివ్వడంలో మనవాళ్లే టాప్
శ్రీకాంత్‌రావు.కె, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులు తాము సంపాదించిన సొమ్మును స్వదేశానికి పంపడంలో ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నారు. స్వదేశంలోని తమ కుటుంబ అవసరాలు, పెట్టుబడుల కోసం గత ఏడాది ఏకంగా 88 బిలియన్ డాలర్లను స్వదేశానికి తరలించగా.. ఈ ఏడాది ఇది ఏకంగా 100 బిలియన్ డాలర్లకు చేరనున్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనా వేయడం గమనార్హం. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే.. 8,24,205 కోట్లు (ఎనిమిది లక్షల 24 వేల 205 కోట్ల రూపాయలు) అన్నమాట. ఇలా విదేశాల్లో సంపాదించిన సొమ్మును స్వదేశానికి తరలించడాన్ని రెమిటెన్స్‌గా పిలుస్తారు. ప్రపంచంలో భారత్‌కు వచ్చే రెమిటెన్సులే ఎక్కువ. ఈ రెమిటెన్సులు మన దేశ వాణిజ్య లోటును తగ్గించేందుకు, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగేందుకు తోడ్పడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, మాంద్యం భయం ఉన్నప్పటికీ భారతదేశానికి భారీగా రెమిటెన్సులు రావడం ఆశావహ పరిణామమని చెప్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రత్యేకం ఎన్నో ఏళ్లుగా మన దేశానికి గణనీయంగా రెమిటెన్సులు వస్తున్నా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరీ ప్రత్యేకమైనది. విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ సంపాదించి మాతృదేశానికి ఏటా పంపిస్తున్న సంపద మొదటిసారిగా వంద బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. మరే దేశం కూడా భారత్ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ఇక్కడ కుటుంబాన్ని వదిలివెళ్లిన వారు తమ కుటుంబ అవసరాల కోసం, ఆస్తులు సమకూర్చుకోవడానికి పంపిస్తున్న సంపద.. ఇదే సమయంలో దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతోంది. భారత్‌కు వస్తున్న రెమిటెన్సులు ప్రధానంగా గల్ఫ్ దేశాలతోపాటు అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాల నుంచి అందుతున్నాయి. కరోనా సమయంలో రెమిటెన్సులు కాస్త తగ్గినట్టు కనిపించినా.. అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తిరిగి పుంజుకున్నాయి. భయాలు తొలగి.. ఆదాయం పెరిగి.. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్లు, ఆంక్షలు, ఉద్యోగాల కోత, ఉపాధికి దెబ్బతో రెండేళ్లపాటు దీని ప్రభావం కనిపించింది. కొన్ని నెలలుగా ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. విదేశాలకు వలసలు, స్వదేశానికి వచ్చే రెమిటెన్సులు పెరుగుతున్నాయి.భారతీయులు 2021లో 7.5 శాతం పెరుగుదలతో 89.4 బిలియన్ డాలర్లను మాతృదేశానికి పంపగా.. ఇది 2022లో 12 శాతం పెరుగుదలతో 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆరు కారణాలను విశ్లేషించింది. ►మాతృదేశం నుంచి వలసలు వెళ్లినవారు తమ దేశానికి నిధులు పంపించాలన్న సంకల్పం. ►కరోనా మహమ్మారి తర్వాత క్రమంగా పరిశ్రమలు, సేవలు, పర్యాటక, విమానయానం తదితర రంగాలు మామూలు స్థితికి చేరుకోవడం, తమ దేశాలకు వెళ్లిన వారు తిరిగి విదేశాల్లో పనులకు వెళ్లడం. ►ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు మెరుగవడంతో విదేశాల్లోని భారతీయుల సంపాదన పెరిగిస్వదేశానికి ఎక్కువ నిధులు పంపించడం. ►విదేశీ మారకద్రవ్యంలో మార్పులు, డాలర్‌తో రూపాయి విలువ తగ్గడం కూడా ఎక్కువ నిధుల ప్రవాహానికి కారణం. ►కరోనా సమయంలో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించడంతో.. సంస్థలు ఉద్యోగులను కాపాడుకోవడం, వేతనాలు పెరగడం వంటివి జరగడం. ►పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల వలసదారుల నిజ ఆదాయాన్ని తగ్గించాయి. అయినా మాతృదేశానికి పంపించే నిధులు పెరిగాయి. దక్షిణాసియాలో పెరుగుదల 3.5 శాతం దక్షిణాసియా దేశాలకు రెమిటెన్సులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 3.5 శాతం అదనంగా ఉంటాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దక్షిణాసియా దేశాలకు మొత్తంగా 163 బిలియన్ డాలర్లు వస్తాయని పేర్కొంది. ఇందులో ఒక్క భారత వాటానే 100 బిలియన్ డాలర్లుగా ఉండబోతున్నట్టు తెలిపింది. విదేశాల నుంచి మాతృదేశాలకు పంపే సొమ్ముపై చార్జీలు కూడా దక్షిణాసియాలో తక్కువని వెల్లడించింది. వచ్చే ఏడాది తగ్గే అవకాశం! అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రగతి తగ్గుదల, ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల దక్షిణాసియా దేశాలకు నిధులు రాక 2023 ఆర్థిక సంవత్సరంలో తగ్గే అవకాశం ఉందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. దక్షిణాసియా దేశాలకు రెమిటెన్సులు ఈ ఏడాది 3.5 శాతం పెరిగితే.. 2023లో పెరుగుదల 0.7 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. భారత్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గల్ఫ్ కౌన్సిల్ ఆఫ్ కంట్రీస్ (జీసీసీ)లోని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్ తదితర దేశాల నుంచి రెమిటెన్సులు తగ్గవచ్చని అంచనా వేసింది. అయితే అమెరికా, యూకే, సింగపూర్ తదితర దేశాల్లో ఎక్కువ వేతనాలు అందుకునే భారతీయులు స్వదేశానికి ఎక్కువ నిధులు పంపే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా చాలా దేశాలకు రెమిటెన్సులు తగ్గిపోయినా.. భారతదేశానికి మాత్రం కనీసం నాలుగుశాతం మేర పెరగవచ్చని పేర్కొంది. విదేశీ పెట్టుబడుల కంటే ఇవే అధికం మన దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల కంటే మనవాళ్లు పంపిస్తున్న నిధులే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. భారతీయులు దేశాభివృద్ధి కోసం పడుతున్న తపన దీని ద్వారా అవగతం అవుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మనదేశ జనాభాలో కేవలం 1.3 శాతం మాత్రమే ఇతర దేశాలకు వలస వెళ్లారని.. కానీ అత్యధికంగా రెమిటెన్సులు పంపుతున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడిస్తోంది. గల్ఫ్ నుంచి తగ్గి అమెరికా, యూరోప్ నుంచి పెరుగుతున్నాయి కొన్నేళ్లుగా అత్యధిక రెమిటెన్స్ పొందుతున్న దేశం మనదే. చైనాను కూడా ఎప్పుడో దాటేశాం. విదేశాల్లో భారతీయులు కష్టపడి సంపాదించి ఆదా చేసిన సొమ్మును ఇక్కడి తమ కుటుంబాల అవసరాలు, ఇతర కమిట్మెంట్లు, పెట్టుబడుల కోసం పంపిస్తున్నారు. గతంలో గల్ఫ్‌దేశాల్లో కార్మికులు సంపాదించిన చిన్నచిన్న మొత్తాలే దేశంలోని తమ కుటుంబాలకు ఎక్కువగా అందేవి. ఇప్పుడు ఇతర దేశాల్లో పెద్ద మొత్తాల్లో సంపాదిస్తున్నవారు కూడా తమ వ్యక్తిగత రెమిటెన్స్‌లు పంపించడం పెరిగింది. దాదాపు రెండున్నరేళ్ల కరోనా పరిణామాల్లో కూడా ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బుపై ప్రభావం పడలేదు. గతంలో గల్ఫ్‌దేశాల నుంచి ఎక్కువగా రెమిటెన్సులు వచ్చేవి. ఇప్పుడు అమెరికా, యూరప్‌ల నుంచి వస్తున్నాయి. భారత్ చేసే ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. వాటికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సిన పరిస్థితిలో లోటు తలెత్తుతోంది. అయితే విదేశాల నుంచి అందుతున్న రెమిటెన్స్‌లు కొంతవరకు ఈ లోటును పూడ్చుతున్నాయి. – డి.నర్సింహారెడ్డి, ప్రముఖ ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విశ్రాంత డీన్ విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి భారత షేర్ మార్కెట్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల రూపంలో విదేశీ మారక ద్రవ్యం వచ్చినా అది తిరిగి వెళ్లిపోతోంది. చైనాకు వస్తున్న విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో మనకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నారైల నుంచి విదేశీ కరెన్సీ, డాలర్ల రూపంలో వచ్చే రెమిటెన్సుల వల్ల దేశంలో విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. రెమిటెన్సులు మరింతగా పెరగడంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పడిపోతున్న రూపాయి విలువ కోలుకునేందుకు ఇది సహాయపడుతుంది. – డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకుడు -
క్యాడ్ 3 శాతం లోపే ఉండొచ్చు!
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మెజారిటీ అంచనాలకన్నా తక్కువగా 3 శాతమే (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. 2022–23లో కనీసం 3.5 శాతం క్యాడ్ నమోదవుతుందన్న మెజారిటీ అంచనాలకు భిన్నంగా ఎస్బీఐ నివేదిక ఉండడం గమనార్హం. సాఫ్ట్వేర్ ఎగుమతులు, రెమిటెన్సులు (ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు దేశానికి పంపే డబ్బు) పెరగడం, స్వాప్ డీల్స్ ద్వారా ఫారెక్స్ నిల్వలలో ఐదు బిలియన్ డాలర్లు పెరిగే అవకాశాలు దీనికి కారణమని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. క్రూడ్ 10 డాలర్ల పెరుగుదలతో క్యాడ్ 0.4 శాతం అప్ క్రూడ్ ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల క్యాడ్‌ను 40 బేసిస్ పాయింట్ల (0.4 శాతం) వరకు ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రతి 10 డాల ర్ల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలకు, 23 బేసిస్ పాయింట్ల వృద్ధి కోతకు దారితీస్తుందని నివేదిక విడుదల సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఎక్సే్ఛంజ్ రేటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న నివేదిక, రూపా యి ప్రతి 100 పైసలు పతనం వల్ల మన సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 మిలియన్ డాలర్లమేర పెరుగుతాయని విశ్లేషించింది. భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువతో పోల్చి) లేదా 23.9 బిలియన్ డాలర్లుగా నమోదయిన విషయాన్ని నివేదిక ప్రస్తావిస్తూ, పటిష్ట రెమిటెన్సులు, సాఫ్ట్వేర్ ఎగుమతు లు క్యాడ్‌ను జూన్ త్రైమాసికంలో 60 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇదే ధోరణి కొనసాగితే రెండవ త్రైమాసికంలో కూడా క్యాడ్ 3.5% లోపే నమోదుకావచ్చని పేర్కొంది. చమురు ధరలు భారీ గా పెరిగితే మాత్రం 2022–23 క్యాడ్‌పై ప్రతికూలత తప్పదని విశ్లేషించింది. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్ 13.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా కరెంట్ అకౌంట్ తీవ్రతకు కారణమవుతోంది. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!
నల్లగొండ : మునుగోడు ఉపఎన్నికలో పోటాపోటీగా పంపకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున మద్యం పంచి, సిట్టింగులు నిర్వహించిన పార్టీలు.. ఆఖరి అస్త్రంగా డబ్బు పంపిణీని ప్రారంభించాయి. మొన్నటివరకు ఒక్కో ఓటుకు రూ.5వేలు, రూ.10 వేలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఓ పార్టీ ఓటుకు రూ.3వేల చొప్పున, మరో పార్టీ రూ.4వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది. కొన్నిచోట్ల రూ.3వేల చొప్పున సమానంగా పంపిణీ జరిగింది. సోమవారం రాత్రి నుంచే పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిని ప్రారంభించాయి. రెండో విడత కూడా డబ్బులు పంపిణీ చేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత రూ.3వేలు, రూ.4వేలు చొప్పున పంపిణీ చేసిన పార్టీలు తిరిగి రెండో విడత ఎంత పంచుతాయో. నేరుగానే ఇంటింటికి తిరిగి నగదును పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటరు ఎటువైపో.. గత రెండు మాసాల నుంచి ఆయా పార్టీలు కులాల వారీగా సమావేశాలు, సభలు పెట్టి ఎన్నో హామీలు ఇచ్చాయి. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు కూడా. ప్రచారాల్లో ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనం భారీగానే హాజరయ్యారు. దీంతో ఓటరుకు ఆయా పార్టీలు డబ్బులు నేరుగా పంపిణీ చేస్తున్నా ఏ పార్టీకి ఓటు వేస్తారన్నదానిపై అంతుచిక్కడం లేదు. అభ్యర్థులు మాత్రం ఎవరి నమ్మకంలో వారు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 298 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. -
భారత్‌కు వచ్చే విదేశీ కరెన్సీ తగ్గింది,ఎందుకంటే!
ముంబై: కోవిడ్–19పరమైన కారణాల నేపథ్యంలో భారత్‌కు వచ్చే రెమిటెన్సుల్లో గల్ఫ్ దేశాల వాటా గణనీయంగా తగ్గింది. 2016–17తో పోలిస్తే 2020–21లో 50 శాతం పైగా క్షీణించి, 30 శాతానికి పరిమితమైంది. అదే సమయంలో బ్రిటన్, అమెరికా, సింగపూర్ల వాటా 36 శాతానికి చేరింది. రెమిటెన్సుల ధోరణులపై కోవిడ్ ప్రభావాల మీద నిర్వహించిన అయిదో విడత సర్వే ఫలితాలను ఉటంకిస్తూ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఒక ఆర్టికల్‌లో ఈ విషయాలు వెల్లడించింది. ఆర్బీఐలోని ఆర్థిక, పాలసీ పరిశోధన విభాగం అధికారులు దీన్ని రూపొందించారు. ఈ ఆర్టికల్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయా రచయితలవే తప్ప రిజర్వ్ బ్యాంక్ ఉద్దేశాలను ఇవి ప్రతిఫలించవని ఆర్బీఐ పేర్కొంది. వలసలు మందగించడం, ఎక్కువ మంది ప్రవాస భారతీయులు ఉపాధి పొందుతున్న అసంఘటిత రంగాలపై కోవిడ్ ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉండటం తదితర అంశాలు గల్ఫ్ దేశాల నుంచి రెమిటెన్సులు తగ్గడానికి కారణం కావచ్చని ఆర్టికల్ అభిప్రాయపడింది. 2020–21లో వచ్చిన రెమిటెన్సుల్లో తక్కువ మొత్తాలతో కూడిన లావాదేవీల వాటా పెరిగినట్లు పేర్కొంది. అత్యధికంగా భారత్‌కు రెమిటెన్సులు వస్తున్న దేశాల జాబితాలో 23 శాతం వాటాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని అధిగమించి అమెరికా అగ్రస్థానంలో నిల్చింది. -
తప్పు చేస్తే వేటే..ఉద్యోగులకు ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్నింగ్!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహిస్తున్న అక్రమ రెమిటెన్స్‌ల కేసు విచారణలో తమ ఉద్యోగులెవరైనా దోషులుగా తేలిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ పాత కేసు గురించి మీడియాలో వార్తలు రావడంతో తాజా వివరణ ఇస్తున్నట్లు పేర్కొంది. 2011–2014 మధ్యలో దిగుమతి లావాదేవీలకు సంబంధించిన రెమిటెన్సుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలకు సంబంధించి కొన్ని సంస్థలపై ఈడీ విచారణ జరుపుతోందని వివరించింది. విచారణ వార్తలతో బీఎస్ఈలో బుధవారం ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 3.42% క్షీణించి రూ. 817.75 వద్ద క్లోజయ్యింది. చదవండి: మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా! -
ఫినో బ్యాంకు.. అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ సేవలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ నగదు బదిలీ సేవలు అందించడానికి ఫినో పేమెంట్స్ బ్యాంకు (ఫినో)కు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఇకపై విదేశాల్లోని వారు పంపే రెమిటెన్సులను ఫినో ఖాతాదారులు కూడా ఇక్కడ అందుకునేందుకు వీలవుతుంది. విదేశాల్లోని కుటుంబసభ్యులు పంపే నిధులను, కస్టమర్లు నేరుగా తమకు దగ్గర్లోని మైక్రో ఏటీఎంలలో లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసులు అందించే ఫినో బ్యాంకు మర్చంట్ పాయింట్లలోనైనా విత్‌డ్రా చేసుకోవచ్చని ఫినో పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ఈ సేవలు అందించగలమని బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మేజర్ ఆశీష్ అహూజా తెలిపారు. ఈ రాష్ట్రాల నుంచి గుజరాత్, పంజాబ్, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా విదేశాల నుంచి రెమిటెన్సులు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని వ్యాపార సంస్థల నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకున్నామని, దీంతో ఈ తరహా సర్వీసులను మరింత త్వరితగతిన అందించడానికి సాధ్యపడగలదని అహూజా తెలిపారు. సెప్టెంబర్ 30 నాటికి తమ నెట్‌వర్క్‌లో ఎనిమిది లక్షల మంది పైగా వ్యాపారులు ఉన్నట్లు వివరించారు. త్వరలో విదేశాలకు త్వరలో విదేశాలకు రెమిటెన్స్ సర్వీసులను కూడా ప్రారంభించాలనే యోచన ఉన్నట్లు అహూజా చెప్పారు. 2021లో భారత్‌లోకి 87 బిలియన్ డాలర్ల మేర రెమిటెన్సులు రావచ్చని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికంగా ఉండగలదని ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదికలో అంచనా వేసింది. చాలా మంది వర్కర్లు గల్ఫ్ దేశాలకు తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నందున.. ఈ రెమిటెన్సులు 2022లో మూడు శాతం పెరిగి 89.6 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. చదవండి: యూపీఐ పేమెంట్స్ చేసే యూజర్లకు శుభవార్త..! ఎన్నారైలకు మరింత సులువు..! -
ఎన్నారైలకు శుభవార్త ! రెమిటెన్సులు ఇకపై సులభం
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న తమ వారి నుంచి భారతీయులు ఇక మరింత సులభంగా డబ్బును అందుకునే (రెమిటెన్సులు) వెసులుబాటు ఏర్పడింది. లబ్ధిదారుల యూపీఐ ఐడీలను ఉపయోగించడం ద్వారా సరిహద్దు నగదు బదిలీని సులభతరం చేయడానికి ఉద్దేశించి ఎన్పీసీఐతో (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇండస్ఇండ్ బ్యాంక్ అవగాహన కుదుర్చుకుంది. ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటన చేసింది. తాజా చొరవతో రెమిటెన్సులు లేదా ఎన్ఆర్ఐ చెల్లింపుల కోసం యూపీఐ ఐడీని వినియోగంలోకి తీసుకువస్తున్న తొలి భారతీయ బ్యాంక్‌గా ఇండస్ఇండ్ నిలవనుందని ప్రకటన వివరించింది. ఈ విధానం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఆపరేటర్లు (ఎంటీఓ).. ఎన్పీసీఐ యూపీఐ చెల్లింపు వ్యవస్థలో అనుసంధానం కావడానికి, లబ్దిదారుల ఖాతాల్లోకి రెమిటెన్సుల చెల్లింపులకు ఇండస్ఇండ్ బ్యాంక్ చానెల్ని వినియోగించుకుంటారు. థాయ్‌లాండ్‌తో ప్రారంభం థాయ్‌లాండ్‌తో తన తాజా రెమిటెన్సుల విధానాన్ని బ్యాంక్ ప్రారంభించింది. ఇందుకుగాను థాయ్‌లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ సేవల సంస్థ– ‘డీమనీ’ సేవలను బ్యాంక్ వినియోగించుకోనుంది. నగదు బదిలీ, విదేశీ కరెన్సీ మార్పిడికి సంబంధించి డీమనీ అత్యుత్తమ సేవలను అందిస్తోంది. డీమనీ వెబ్సైట్లో భారతదేశంలోని లబ్ధిదారుల యూపీఐ ఐడీలను జోడించి, విదేశాల్లోని భారతీయులు ఎవరైనా సులభంగా నిధులను బదిలీ చేయవచ్చు. డీమనీ తరహాలోనే వివిధ దేశాల్లోని అత్యుత్తమ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. భారత్దేశంలోని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ల వివరాలతో పనిలేకుండా కేవలం వారి యూపీఐ ఐడీలను యాడ్ (జోడించడం) చేసుకోవడం ద్వారా ఎన్ఆర్ఐలు తేలిగ్గా నిధుల బదలాయింపు జరపడంలో తమ చొరవ కీలకమైనదని ప్రకటనలో బ్యాంక్ హెడ్ (కన్జూమర్ బ్యాంకింగ్, మార్కెటింగ్) సౌమిత్ర సేన్ పేర్కొన్నారు. యూపీఐ వినియోగించే అంతర్జాతీయ పర్యాటకులకు తాజా ఏర్పాట్లు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయని ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీన్ రాయ్ పేర్కొన్నారు. యూపీఐ ద్వారా రెమిటెన్సులకు సంబంధించి తాజా చొరవ గొప్ప ముందడుగని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: విదేశాల్లో ఉద్యోగానికి సై.. ఐటీదే ఆధిపత్యం -
ప్రవాసీ నిధుల ఆకర్షణలో భారత్ టాప్.. ఈ ఏడాది రూ. 6.47 లక్షల కోట్ల రాక
వాషింగ్టన్: విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడంలో (రెమిటెన్సులు) భారతీయులే మొదట నిలుస్తున్నారు. భారతీయుల తర్వాత స్థానంలో చైనా, మెక్సికో, ఫిలిప్ఫైన్స్, ఈజిప్టు దేశాలు అత్యధికంగా ప్రవాసీయుల నుంచి నిధులు అందుకుంటున్న దేశాలుగా నిలిచాయి. ఈ విషయాలను వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం ప్రపంచబ్యాంక్ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం 2021లో ఇలా దేశానికి రానున్న మొత్తం 87 బిలియన్ డాలర్ల నిధులు ఇప్పటికే వచ్చాయి. గతేడాది ఈ మొత్తం 83 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా నుంచే అధికం ప్రవాసీయుల నుంచి ఇండియాకు అందుతున్న నిధుల్లో 20 శాతం వరకు అమెరికా నుంచి వస్తున్నాయి. యూఎస్ఏలో సెటిలైన ఎన్నారైలు ఇండియాలో ఉన్న తమ వారికి భారీ ఎత్తున నగదు పంపిస్తున్నారు. గతంలో ప్రవాసీ నిధులు అధికంగా అందించడంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న వలక కార్మికులు ముందుండే వారు. గల్ఫ్ పై కోవిడ్ ఎఫెక్ట్ గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు ప్రవాసీయులు పంపించే నిధులు ఈసారి తగ్గిపోయాయి. కరోనా కారణంగా వలస కార్మికుల్లో చాలా మంది ఇండియాకు తిరిగి వచ్చేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టినా వీరంతా తిరిగి గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. ఒకసారి పరిస్థితులు చక్కబడితే మరోసారి గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకి నిధుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు - భారత్‌కు రెమిటెన్సులు 2022లో 3 శాతం పెరిగి 89.6 బిలియన్ డాలర్లకు చేరుతాయని అంచనా. - దిగువ, మధ్య స్థాయి ఆదాయ దేశాలకు రెమిటెన్సుల మొత్తం 2021లో 7.3% పెరిగి 589 బిలియన్ డాలర్లకు చేరనుంది. - 2020తో పోల్చితే రెమిటెన్సుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండే వీలుంది. కోవిడ్–19 సవాళ్ల తీవ్రత తగ్గడం దీనికి కారణం. - కోవిడ్–19 సంక్షోభ సమయంలో పలు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ ఇబ్బందుల పరిష్కారానికి, సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వ నగదు బదిలీ కార్యక్రమాలకు తోడు రెమిటెన్సుల తోడ్పాటు ఎంతగానో ఉందని ప్రపంచబ్యాంక్ సామాజిక, ఉపాధి పరిరక్షణా వ్యవహారాల డైరెక్టర్ మైఖేల్ పేర్కొన్నారు. చదవండి:సౌదీ అరేబియా, ఈజిప్టులలో ఐఐటీ, ఢిల్లీ క్యాంపస్‌లు -
మనోళ్లు పంపింది 83 బిలియన్ డాలర్లు..!
వాషింగ్టన్: కరోనా కష్టకాలంలోనూ విదేశాల్లోని భారతీయులు సొంత గడ్డకు భారీ మొత్తాలను (రెమిటెన్సులు) పంపారు. 2020లో రెమిటెన్సుల ద్వారా భారతీయులు పొందిన మొత్తం 83 బిలియన్ డాలర్లు. 2019తో పోల్చితే ఈ మొత్తాలు కేవలం 0.2% తగ్గాయి. 2019లో భారత్ స్వీకరిం చిన నిధులు 83.3 బిలియన్ డాలర్లు. 2020 రెమిటెన్సులకు సంబంధించి ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదికలోని ముఖ్యాంశాలను చూస్తే.. ► 2019లో చైనా 68.3 బిలియన్ డాలర్లను రెమిటెన్సుల రూపంలో పొందితే, 2020లో ఈ పరిమాణం 59.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. తద్వారా భారత్ తర్వాత రెండవ స్థానంలో చైనా నిలిచింది. ► తాజా సమీక్షా సంవత్సరంలో భారత్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి రెమిటెన్సులు 17 శాతం పడిపోయాయి. అయితే అమెరికా, ఇతర దేశాల నుంచి భారీగా నిధులు రావడంతో ఈ ప్రభావం మొత్తం స్వీకరణలపై పడలేదు. గల్ఫ్ నుంచి పెద్ద ఎత్తున భారతీయులు దేశానికి తిరిగి రావడం రెమిటెన్సులపై ప్రభావం చూపింది. ► భారత్, చైనాల తర్వాతి స్థానంలో మెక్సికో (42.8 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్ (34.9 బిలియన్ డాలర్లు), ఈజిప్టు (29.6 బిలియన్ డాలర్లు), పాకిస్తాన్ (26 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (24.4 బిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (21 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. ► పాకిస్తాన్‌కు రెమిటెన్సులు 17 శాతం పెరిగాయి. ఇందులో అధిక భాగం సౌదీ అరేబియా నుంచి వచ్చాయి. తరువాతి స్థానంలో యూరోపియన్ యూనియన్ దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ఉన్నాయి. ► బంగ్లాదేశ్ విషయంలో పెరుగుదల రేటు 18.4 శాతం ఉంటే, శ్రీలంక విషయంలో ఈ రేటు 5.8 శాతంగా ఉంది. ► నేపాల్ విషయంలో ఈ పరిమాణం 2 శాతం పడిపోయింది. ► 2020లో భారీగా రెమిటెన్సులు పడిపోతాయని అంచనావేసినప్పటికీ, ఇలాంటి ప్రతికూల పరిస్థితి నెలకొనలేదు. దిగువ, మధ్య ఆదాయ దేశాలకు 2019లో 548 బిలియన్ డాలర్లు వస్తే, 2020లో ఈ పరిమాణం కేవలం 1.6 శాతం తగ్గి 540 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఆయా దేశాలకు పెద్ద ఆదాయ వనరుగా మారింది. ► రెమిటెన్సులు పెరిగిన ప్రాంతాల్లో లాటిన్ అమెరికా, కరేబియన్ (6.5 శాతం), దక్షిణ ఆసియా (5.2 శాతం), పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా (2.3 శాతం)లు ఉన్నాయి. ► తగ్గిన ప్రాంతాల్లో తూర్పు ఆసియా, పసిఫిక్ (7.9 శాతం), యూరోప్, సెంట్రల్ ఆసియా (9.7 శాతం), సహారా ప్రాంత ఆఫ్రికా (12.5 శాతం) ఉన్నాయి. అమెరికా నుంచే అత్యధిక రెమిటెన్సులు రెమిటెన్సులు భారీగా తరలివెళ్లిన దేశాల్లో అమెరికా 68 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో యూఏఈ (43 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (34.5 బిలియన్ డాలర్లు), స్విట్జర్లాండ్ (27.9 బిలియన్ డాలర్లు), జర్మనీ (22 బిలియన్ డాలర్లు), చైనా (18 బిలియన్ డాలర్లు) నిలిచాయి. భారత్ విషయంలో ఈ పరిమాణం 7 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019లో ఈ పరిమాణం 7.5 బిలియన్ డాలర్లుగా ఉంది. -
భారత్‌కు రెమిటెన్సుల్లో మహిళలే టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశాల నుంచి భారత్‌లోని బంధువులకు, స్నేహితులకు నగదు చెల్లింపుల్లో (రెమిటెన్సులు) మహిళలూ ముందున్నారు. డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వరల్డ్‌రెమిట్ వేదికగా 2015 సెప్టెంబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ నుంచి భారత్‌కు వచ్చిన రెమిటెన్సుల ప్రకారం.. మొత్తం చెల్లింపుల్లో భారతీయ మహిళలు పంపినవి ఆస్ట్రేలియాలో 18 నుంచి 26 శాతానికి, యూకేలో 21 నుంచి 32 శాతానికి పెరిగాయి. యూఎస్ఏ విషయంలో ఇది 25 నుంచి 24 శాతానికి వచ్చింది. ఆస్ట్రేలియా, యూకేల్లో సేవల రంగం విస్తృతి ఈ పెరుగుదలకు కారణం కావొచ్చు. ఆస్ట్రేలియాలో మొత్తం ఉద్యోగుల్లో సేవల రంగం వాటా అత్యధికంగా 87 శాతం ఉంది. యూఎస్ఏ, యూకే నుంచి భారత్‌కు నగదు పంపుతున్న మహిళల్లో 35, ఆపైన వయసున్న వారు అధికంగా ఉన్నారు. ఆస్ట్రేలియా విషయంలో 25–30 ఏళ్ల వయసున్న వారు ఎక్కువ. పరిమాణం పరంగా యూఎస్ఏ నుంచి భారత్‌కు అత్యధికంగా హైదరాబాద్‌కు చెల్లింపులు జరుగుతున్నాయి. లుధియానా, అమృత్సర్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వరల్డ్‌రెమిట్ దక్షిణాసియా డైరెక్టర్ రుజాన్ అహ్మద్ తెలిపారు. భారత్‌కు నగదు పంపుతున్న టాప్–10 దేశాల వాటా ఏటా రూ.5.81 లక్షల కోట్లు అని చెప్పారు. అత్యధికంగా నగదును స్వీకరిస్తున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉందన్నారు. -
డబ్బు పంపిస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే!
వాషింగ్టన్ : విదేశాల్లో జీవనం సాగిస్తూ స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపే వలసదారుల్లో అత్యధికులు భారతీయులేనని ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచంలో దేశాలతో పోల్చితే భారతదేశం నుంచే అత్యధికంగా వర్కర్లు విదేశాలకు వలసలు వెళ్లారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఆ లెక్క ప్రకారం దాదాపు 17 మిలియన్ల వర్కర్లు భారత్ నుంచి వెళ్లి వివిధ విదేశాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యకర విషయమేమంటే, ఈ రకంగా విదేశాల్లో జీవనం కొనసాగిస్తూ దేశంలోని తమ తమ కుటుంబాలకు పంపిస్తున్న డబ్బు మొత్తం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటోందని ప్రపంచబ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది సుమారు 79 బిలియన్ డాలర్ల మేరకు సంపద విదేశీ రెమిటెన్స్ రూపంలో భారత్‌కు చేరినట్టు పేర్కొంది. మిగతా ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే ఇదే అత్యధికమని తెలిపింది. అదే విధంగా వలస వెళ్లి విదేశాల్లో జీవనోపాధి పొందుతున్న వారిలో కూడా అత్యధికులు భారతీయులేనని ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది. వలసదారుల నుంచి విదేశీ రెమిటెన్స్ రూపంలో అత్యధిక జనాభా కలిగిన చైనా 67 బిలియన్ డాలర్లతో (10 మిలియన్ వలసదారులు) రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో భారతీయలు డబ్బు పంపిస్తున్నా.. అది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో 2.7 శాతానికి మాత్రమే సమానంగా ఉందని వెల్లడించింది. వలసదారులు వారివారి దేశానికి పంపిస్తున్న డబ్బు చిన్న చిన్న దేశాలతో పోలిస్తే ఇది చాలా స్పల్పమని తేలింది. వలస, అభివృద్ధి పేరిట రూపొందించిన నివేదికలో దిగువ మధ్య తరగతి ఆదాయ దేశాలు 2018 ఏడాదికి గానూ రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదు చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2017 లో ఈ దేశాలన్నీ కలిపి 483 బిలియన్ డాలర్లను విదేశీ చెల్లింపులుగా పొందగా, గతేడాది ఈ సంఖ్య 529 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. అదే విధంగా విదేశీ చెల్లింపులపై ప్రధానంగా ఆధారపడుతున్న దేశాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో 2017 లో రెండున్నర బిలియన్ డాలర్లను ప్రవాసుల ద్వారా పొందిన కిర్గిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతానికి సమానమని పేర్కొంది. అయితే విదేశాల్లో ఉన్న నేపాల్ పౌరులు మాత్రం 6.9 బిలియన్ డాలర్ల (28 శాతం) తో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలలో కీలక పాత్ర పోషించారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. -
‘మనోళ్లు రూ 55,000 కోట్లు పంపారు’
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది విదేశాల్లో భారత సంతతికి చెందిన వారు ప్రపంచంలోనే అత్యధికంగా 79 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 55 వేల కోట్లు పైగా స్వదేశానికి పంపారని ప్రపంచ బ్యాంక్ ఓ నివేదికలో వెల్లడించింది. భారత్ తర్వాత 67 బిలియన్ డాలర్లతో చైనా, 36 బిలియన్ డాలర్లతో మెక్సికో టాప్ 3 స్ధానాల్లో నిలవగా, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్‌లు తర్వాతి స్ధానాల్లో ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. స్వదేశాలకు డబ్బు పంపడంలో భారత్ అగ్రస్ధానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోందని ప్రపంచ బ్యాంక్‌కు చెందిన వలసలు, అభివృద్ధి నివేదిక తెలిపింది. 2016లో భారత్ స్వదేశంలో తమ వారికి చేరవేసిన మొత్తం 62.7 బిలియన్ డాలర్లు కాగా, 2017లో వాటి మొత్తం 65.3 బిలియన్ డాలర్లకు పెరగ్గా 2018లో రెమిటెన్స్‌లు 79 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. 2018లో భారత్‌కు తరలిన విదేశీ కరెన్సీ 14 శాతం పెరిగిందని, కేరళలో పోటెత్తిన వరదల వల్ల అక్కడి నుంచి వలస వచ్చిన వారు తమ కుటుంబాలకు పెద్దమొత్తంలో సొమ్ము పంపడంతో రెమిటెన్స్‌లు పెరిగాయని ఈ నివేదిక అంచనా వేసింది. -
యూఏఈ నుంచి కేరళకు భారీగా రెమిటెన్స్‌లు
న్యూఢిల్లీ : భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలతో కొట్టుమిట్టాడుతున్న కేరళను ఆదుకోవడం కోసం యూఏఈ రూ.700 కోట్ల విరాళం ప్రకటించిందని.. దాన్ని కేంద్రం తిరస్కరించిందని.. కానీ అసలు యూఏఈ విరాళమే ప్రకటించలేదని... ఇలా వార్తలు మీద వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వరదల సమయంలో వచ్చిన ఈ విరాళం పక్కన పెడితే, కేరళకు యూఏఈ నుంచి భారీ ఎత్తునే సంపద వస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? రెమిటెన్స్‌ల రూపంలో. కేరళకు, యూఏఈకు చాలా ఏళ్ల నుంచే అవినాభావం సంబంధం ఉంది. కేరళ నుంచి వలస వెళ్లిన వారు ఎక్కువగా యూఏఈలోనే స్థిరపడ్డారు. అక్కడ సేవా రంగంలో కేరళ వారిదే ఆధిపత్యం. కేరళ మైగ్రేషన్ సర్వే రిపోర్టు ప్రకారం 36 లక్షల మందికి పైగా కేరళవాసులు యూఏఈలో నివసిస్తున్నట్టు తెలిసింది. యూఏఈలో మాత్రమే కాక, అటు ఖతర్‌లోనూ కేరళవాసులు నివసిస్తున్నారు. యూఏఈలో 41.5శాతం, ఖతర్‌లో 8.5 శాతం కేరళవాసులే. దీంతో విదేశాల నుంచి కేరళకు భారీ ఎత్తునే రెమిటెన్స్‌లు వస్తున్నాయి. కేరళకు, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థకు రెమిటెన్స్‌లు ఎంతో కీలకం. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్పై వరల్డ్ బ్యాంక్ రూపొందించిన రిపోర్టులో, 2017లో ఇన్వర్డ్ రెమిటెన్సస్(దేశానికి వస్తున్న చెల్లింపుల్లో)లో ప్రపంచంలోనే భారత్ టాప్‌లో ఉందని వెల్లడైంది. 2017లో దాదాపు 69 బిలియన్ డాలర్లు అంటే రూ.4,82,827 కోట్ల రెమిటెన్స్‌లో భారత్‌కు వచ్చాయి. ఇవే భారత జీడీపీలో 3 శాతంగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా కూడా కేరళకే వచ్చాయని బిజినెస్ టుడే నివేదించింది. కేరళకు మొత్తం రెమిటెన్స్‌లో 40 శాతం రాగ, ఆ తర్వాత పంజాబ్‌కు 12.7 శాతం, తమిళనాడుకు 12.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌కు 5.4 శాతం రెమిటెన్స్‌లు వచ్చినట్టు తెలిసింది. రీసెర్చ్ పేపర్ ప్రకారం, కేరళకు వచ్చే రెమిటెన్స్‌లు ఆ రాష్ట్ర జీడీపీలో 36 శాతం ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం కేరళకు వచ్చే రెమిటెన్స్‌ల విలువ సుమారు రూ.90వేల కోట్లని తెలిసింది. ఇవన్నీ గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయని రిపోర్టులు తెలిపాయి. కేరళ నుంచి వలసపోయి యూఏఈలో నివసించే బ్లూకాలర్ వర్కర్లు, ప్రొఫిషినల్స్ నుంచి ఇవి ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. అంతేకాక, విదేశాల్లో నివసించే కేరళవాసులు ఎక్కువగా ఇక్కడ బంగారం, భూమిపై పెట్టుబడి పెడుతూ ఉంటారు. ప్రవాస మలయాళీల డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్లకు పైమాటేనని తెలిసింది. రెమిటెన్స్ రూపంలో కేరళ పొందే మొత్తంలో 20 శాతం, బ్యాంక్ అకౌంట్లలోకి డిపాజిట్లు, సేవింగ్స్ రూపంలో వస్తున్నాయని ఆర్బీఐ సర్వే రిపోర్టు కూడా వెల్లడించింది. దేశంలో అత్యధిక నిరుద్యోగ నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా ఉన్న కేరళకు, అధిక ఆదాయం యూఏఈ, గల్ఫ్ దేశాల నుంచే వచ్చే రెమిటెన్స్‌ల రూపంలోనే వస్తుందని పలు రిపోర్టులు వెల్లడించాయి. అత్యధిక నిరుద్యోగ నిష్పత్తి ఉన్నప్పటికీ, కేరళ తలసరి ఆదాయం సుమారు 60 శాతం అధికంగా ఉంటుంది. ఇదంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆదాయం మహిమనే అని చెప్పుకోవాలి. -
రెమిటెన్స్ లు తగ్గుతాయ్
ప్రపంచ బ్యాంక్ అంచనా వాషింగ్టన్: భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లు ఈ ఏడాది తగ్గుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. తక్కువ ముడిచమురు ధరలు సహా ఇండియాకు ఎక్కడి నుంచైతే రెమిటెన్స్ అధికంగా వస్తున్నాయో ఆయా ప్రాంతాల్లోని బలహీనమైన ఆర్థిక వృద్ధే రెమిటెన్స్‌ల తగ్గుదలకు ప్రధాన కారణంగా నిలుస్తుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. ⇔ ఈ ఏడాది భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లు 5 శాతం క్షీణతతో 65.5 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతాయి. ⇔ రెమిటెన్స్‌లు స్వల్పంగా తగ్గినప్పటికీ ప్రపంచంలో రెమిటెన్స్‌లు స్వీకరణలో భారత్ టాప్‌లోనే కొనసాగుతుంది. ⇔ ఇండియా తర్వాతి స్థానంలో 65.2 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ల స్వీకరణతో చైనా రెండో స్థానంలో ఉంటుంది. ⇔ 20.3 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ల స్వీకరణతో పాకిస్తాన్ ఐదో స్థానంలో నిలువొచ్చు. ⇔ బంగ్లాదేశ్‌కు వచ్చే రెమిటెన్స్ల్లోనూ 3.5 శాతం క్షీణత నమోదు కావొచ్చు. ⇔ పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు వచ్చే రెమిటెన్స్‌లు వరుసగా 5.1 శాతం, 1.6 శాతం మేర పెరగొచ్చు. -
చట్టబద్దంగా డబ్బు అందుకుంటున్నా: అమితాబ్
ముంబై: తాను ఎటువంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడలేదని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తెలిపారు. పనామాలో తాను పెట్టుబడులు పెట్టినట్టు పేర్కొన్న కంపెనీల గురించి తనకేమీ తెలియదని చెప్పారు. ఇటువంటి కంపెనీలకు తాను డైరెక్టర్ గా లేనని స్పష్టం చేశారు. తాను చట్టబద్దంగా పన్నులు చెల్లిస్తున్నానని అన్నారు. విదేశాల నుంచి నిబంధనలకు అనుగుణంగా డబ్బు అందుకుంటున్నానని, సుంకాలు చెల్లిస్తున్నానని చెప్పారు. తన పేరును దుర్వినియోగం చేయడానికి ఇదంతా చేస్తున్నారని బిగ్ బి ఆవేదన వ్యక్తం చేశారు. పనామా పత్రాల్లో తన గురించి పేర్కొన్నదంతా అసత్యం, అభూత కల్పన అని అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ సోమవారం ప్రకటించారు. డబ్బులు అక్రమంగా దాచడానికి మొస్సాక్ ఫోన్సెకా అనే సంస్థ ద్వారా విదేశీ ప్రముఖులు పనామాలో 2,14,000 కంపెనీలు ఏర్పాటు చేసిటనట్టు కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) వెల్లడించింది. ఈ జాబితాలో అమితాబ్, ఐశ్వర్యారాయ్, డీఎల్ఎఫ్ కేపీ సింగ్, నాయకులు, కార్పొరేట్లు సహా 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్టు తెలిపింది. -
రెమిటెన్సులలో భారత్ అగ్రస్థానం
యూఎన్డీపీ నివేదిక న్యూఢిల్లీ: భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఏడాది రెమిటెన్సెస్ (ప్రవాస భారతీయులు ఇండియాకు పంపిస్తున్న డబ్బు) జోరుగా వస్తాయని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. 2014లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 43,600 కోట్ల డాలర్ల రెమిటెన్సెస్ వచ్చాయని యునెటైట్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ) తాజా నివేదిక పేర్కొంది. ఈ రెమిటెన్సెస్ ఈ ఏడాది 44,000 కోట్ల డాలర్లకు చేరతాయని వివరించింది. ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.., 2014లో భారత్‌కు 7,000 కోట్ల డాలర్లు (భారత జీడీపీలో ఇది 4%)రెమిటెన్సెస్ వచ్చాయి. ఆ ఏడాది అధిక రెమిటెన్సెస్ వచ్చిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(6,400 కోట్ల డాలర్లు, జీడీపీలో 1 శాతం కంటే తక్కువ),ఫిలిప్పైన్స్ (2,800 కోట్ల డాలర్లు, 10 శాతం జీడీపీ),మెక్సికో (2,500 కోట్ల డాలర్లు, 2 శాతం)నిలిచాయి. * అంతర్జాతీయంగా రెమిటెన్సెస్ మొత్తం గత ఏడాది అధికారిక అంచనాల ప్రకారం 58,300 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఈ రెమిటెన్సెస్ 2015లో 58,600 కోట్ల డాలర్లకు పెరగవచ్చు. * పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ మార క ద్రవ్య నిధులకు మూలం ఈ రెమిటెన్సెస్లే. * విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, శ్రామికుల పని, వారు పంపిస్తున్న రెమిటెన్సెస్ ఇరు దేశాల్లో వృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి.