రెమిటెన్సులలో భారత్ అగ్రస్థానం | India ranks 130th in Human Development Index: UNDP | Sakshi
Sakshi News home page

రెమిటెన్సులలో భారత్ అగ్రస్థానం

Published Tue, Dec 15 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

రెమిటెన్సులలో భారత్ అగ్రస్థానం

రెమిటెన్సులలో భారత్ అగ్రస్థానం

యూఎన్‌డీపీ నివేదిక
న్యూఢిల్లీ: భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఏడాది రెమిటెన్సెస్ (ప్రవాస భారతీయులు ఇండియాకు పంపిస్తున్న డబ్బు) జోరుగా వస్తాయని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. 2014లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 43,600 కోట్ల డాలర్ల రెమిటెన్సెస్ వచ్చాయని యునెటైట్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌డీపీ) తాజా నివేదిక పేర్కొంది.

ఈ రెమిటెన్సెస్ ఈ ఏడాది 44,000 కోట్ల డాలర్లకు చేరతాయని వివరించింది. ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..,
     2014లో భారత్‌కు 7,000 కోట్ల డాలర్లు (భారత జీడీపీలో ఇది 4%)రెమిటెన్సెస్ వచ్చాయి. ఆ ఏడాది అధిక రెమిటెన్సెస్ వచ్చిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(6,400 కోట్ల డాలర్లు, జీడీపీలో 1 శాతం కంటే తక్కువ),ఫిలిప్పైన్స్ (2,800 కోట్ల డాలర్లు, 10 శాతం జీడీపీ),మెక్సికో (2,500 కోట్ల డాలర్లు, 2 శాతం)నిలిచాయి.
     
* అంతర్జాతీయంగా రెమిటెన్సెస్ మొత్తం గత ఏడాది అధికారిక అంచనాల ప్రకారం 58,300 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఈ రెమిటెన్సెస్ 2015లో 58,600 కోట్ల డాలర్లకు పెరగవచ్చు.
* పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ మార క ద్రవ్య నిధులకు మూలం ఈ రెమిటెన్సెస్‌లే.
* విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, శ్రామికుల పని, వారు పంపిస్తున్న రెమిటెన్సెస్ ఇరు దేశాల్లో వృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement