2022లో 111 బిలియన్ డాలర్లు
ఈ స్థాయిని అందుకున్న మొదటి దేశంగా రికార్డు
ఐక్యరాజ్యసమితి: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తమ సంపాదనను పంపడంలో (రెమిటెన్స్) రికార్డు సృష్టించారు. భారత్‌కు ఈ తరహా నిధులు 2022లో 111.22 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనితో ఇంత భారీ స్థాయిని అందుకున్న తొలి దేశంగా భారత్ రికార్డులకు ఎక్కింది. నిజానికి రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లు దాటిన తొలి దేశంగా కూడా భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ మేరకు విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
» రెమిటెన్సులకు సంబంధించి భారత్ తరువాతి నాలుగు స్థానాల్లో మెక్సికో(61 బిలియన్ డాలర్లు), చైనా (51 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ నిలిచాయి. 2021లో చైనా స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది.
» దక్షిణాసియా నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నందున ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతోంది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెమిటెన్సులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 21.5 బిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలుస్తోంది.
» 44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది.
» విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా (8,33,000) ఉంది. తరువాతి స్థానాల్లో బ్రిటన్ (దాదాపు 6,01,000), ఆస్ట్రేలియా (దాదాపు 3,78,000), జర్మనీ (3,76,000 పైగా), కెనడా (దాదాపు 3,18,000) ఉన్నాయి.
భారత్ పయనమిలా...
(అంకెలు బిలియన్ డాలర్లలో)
2010 53.48
2015 68.91
2020 83.15
2022 111.22
Comments
Please login to add a commentAdd a comment