
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహిస్తున్న అక్రమ రెమిటెన్స్‌ల కేసు విచారణలో తమ ఉద్యోగులెవరైనా దోషులుగా తేలిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఇండస్‌ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ పాత కేసు గురించి మీడియాలో వార్తలు రావడంతో తాజా వివరణ ఇస్తున్నట్లు పేర్కొంది.
2011–2014 మధ్యలో దిగుమతి లావాదేవీలకు సంబంధించిన రెమిటెన్సుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలకు సంబంధించి కొన్ని సంస్థలపై ఈడీ విచారణ జరుపుతోందని వివరించింది. విచారణ వార్తలతో బీఎస్‌ఈలో బుధవారం ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేరు 3.42% క్షీణించి రూ. 817.75 వద్ద క్లోజయ్యింది.
చదవండి: మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా!