సాక్షి,హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈకి సంబంధించిన లావాదేవీలను మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్‌తో పాటు ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగనుంది.
కేసులో ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేటీఆర్‌పై ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. కేటీఆర్‌తో పాటు మున్సిపల్ శాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌కుమార్,హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డిలపై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, ఫార్ములా ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు శుక్రవారం(డిసెంబర్ 20) సాయంత్రమే హైకోర్టులో ఊరట లభించింది.
కేటీఆర్‌ను ఫార్ములా ఈ కేసులో డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను 27 వరకు వాయిదా వేసింది. కేసు దర్యాప్తును ఏసీబీ కొనసాగించవచ్చని తెలిపింది. ఇంతలోనే కేటీఆర్‌పై ఇదే వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేయడంపై బీఆర్‌ఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment