
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోలు ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్ ధర 13 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.60లుగా ఉండగా, డీజిల్ ధర రూ.65.86లుగా ఉన్నాయి. అయితే చెన్నైలో లీటరు పెట్రోలుధర రూ. 73.28 వద్ద గరిష్ట రేటు పలుకుతోంది. అటు డీజిల్ ధర రూ.69.57గా ఉంది.
ముంబై : పెట్రోల్ ధర రూ.76.23, డీజిల్ ధర రూ.68.97
హైదరాబాద్ : పెట్రోల్ ధర రూ.74.90 వద్ద.. డీజిల్ ధర రూ.71.60
అమరావతి : పెట్రోల్ ధర రూ.74.70, డీజిల్ ధర రూ.70.99
కోల్‌కతా: పెట్రోలు ధర రూ.72.71 పెట్రోలు ధర రూ.67.64