ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్( ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రివ్యూను ప్రకటించింది. ఆర్‌బీఐ చేపట్టిన ద్వైమాసిక సమీక్షలో అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోను 6.0 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగానే ఉంచుతున్నట్టు తెలిపింది. కాగా.. బ్యాంక్ రేటు 6.25 శాతంగా ఉంది. ఆరుగురు మానిటరీ పాలసీ సభ్యుల్లో అయిదుగురు యథాతథానికి ఓటు వేశారు. మైఖేల్ పాత్రో ఒక్కరే వడ్డీరేటు పెంపువైపు మొగ్గు చూపారు. దీంతో నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో పాజిటివ్ ధోరణి కనిపిస్తోంది.
తొలి క్వార్టర్‌లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4 శాతం నుంచి 5.1 శాతానికి పుంజుకుంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. కాగా.. 2018-19లో రియల్ జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదుకావచ్చని విశ్లేషించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ మొదటి పరపతివిధాన సమీక్ష ఇది. గ్లోబల్ అనిశ్చితి, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆర్‌బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment