
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం లాభాల బాట పట్టాయి. ప్రారంభంలో స్వల్పంగా 23.25 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్, ప్రస్తుతం 68 పాయింట్ల లాభంలో 31,565 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 21 పాయింట్ల లాభంలో 9880 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో మార్కెట్లు భారీ లాభాలతో జంప్‌చేసినప్పటికీ నేడు మాత్రం ఆర్బీఐ సమీక్షపై ఎక్కువగా దృష్టిసారించాయి. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందో లేదోనని ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు.
రంగాల వారీగా ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ స్టాక్స్ సానుకూల దిశగా కదులుతున్నాయి. మెటల్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీసీ, హీరో మోటార్‌కార్పొ, హెచ్‌పీసీఎల్, ఐఓసీలు టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తుండగా.. బజాజ్ ఆటో, టాటా మోటార్స్ డీవీఆర్, కోల్ ఇండియాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసల నష్టంలో 65.36 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 191 రూపాయల నష్టంలో 29,366 వద్ద కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment