
సాక్షి,ముంబై: కీలక వడ్డీరేట్లపై ఆర్బ్‌ఐ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్‌మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 58588 వద్ద,నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 17526వద్ద కొనసాగుతున్నాయి ఈ ఉదయం RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) బెంచ్‌మార్క్ వడ్డీ రేటుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించనుంది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ వడ్డన ఉంటుందనేది ప్రధాన అంచనా.
మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ప్రపంచ మాంద్యం గురించి ఆందోళనలకు ఆజ్యం పోస్తున్న నేపథ్యంలో ప్రధాన ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ఎస్‌బిఐ లైఫ్, ఐషర్ మోటార్స్ ,యాక్సిస్ బ్యాంక్ ఒక్కో శాతం చొప్పున ఎగిసి గిటాప్ గెయినర్లుగా ఉండగా, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్ , ఎంఅండ్ ఎం టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.