సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారం ఆరంభంలోనే బలహీనంగా ముగిసింది. బలహీన గ్లోబల్ సంకేతాలున్నప్పటికీ, మార్కెట్ సానుకూలంగా ప్రారంభమై, రికార్డు స్థాయిని టచ్ చేసింది. కానీ హై స్టాయిలో నిలదొక్కు కోవడంలో విఫలమైంది.ముఖ్యంగా బ్యాంకింగ్,రియల్టీ ఇతర హెవీవెయిట్ షేర్లలో ఒత్తిడి, ప్రాఫిట్ బుకింగ్‌తో సెన్సెక్స్ 216 పాయింట్లు లేదా 0.34 శాతం క్షీణించి 63,168, వద్ద నిఫ్టీ 70.50 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 18,756 వద్ద ముగిసాయి.
ఆటో, బ్యాంక్, రియాల్టీ, పవర్, రియల్టీ,ఎఫ్‌ఎంసిజి నష్టపోగా, పిఎస్‌యు బ్యాంక్స్, ఐటీ స్వల్పంగా పెరిగాయి. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు డిఫెన్స్ షేర్లు లాభపడటం విశేషం.
టాప్ లూజర్
అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు సోమవారం 4 శాతం నష్టాలతో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ లూజర్‌గా నిలిచింది. గత మూడు నెలలో ఇదే అతిపెద్ద నష్టం. మే 2023 తర్వాత ఇంత కనిష్ట స్థాయికి చేరడం తొలిసారి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.12,000 కోట్లను నష్టపోయింది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ ఎం, టీసీఎస్ లాభపడగా, కోటక్ మహీంద్ర, హీరో మోటో, యాక్సిస్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.94 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment