సాక్షి,ముంబై : స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు ఎగిసి, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి కొనసాగుతోంది. ఆర్‌బీఐ రేట్ కట్ అంచనాలతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. దీంతో సూచీలు రెండూ కీలక మద్దతు స్థాయిలపైన స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభపడుతున్నాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు 300 పాయింట్లకు పైగా ఎగిసింది. ఈ రోజు కూడా యస్ బ్యాంకు మరో 5 శాతం ఎగిసింది. వీటితోపాటు బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, వేదాంతా భారీగా లాభపడుతున్నాయి. మరోవైపు జీఎంటర్ టైన్‌మెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, భారతి ఇన్‌ఫ్రాటెల్, గ్రాసిం, పవర్‌గ్రిడ్ నష్టపోతున్నాయి.
అటు డారు మారకంలో రూపాయి కూడా పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించి, 70.82 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment